TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ కి పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నాడు..!!

Published on: Wed Jul 4, 2018 12:12PM

 

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ.. అధికారం పక్షం, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నాయి.. తాజాగా ఏపీ నీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమ ఓ వైపు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి చెప్తూనే, మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మీద తీవ్ర విమర్శలు చేసారు.. 'తాము ఉత్తరాంధ్రకు నీళ్లు ఇచ్చేందుకు రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేస్తున్నామని, ఇప్పటివరకు రూ.1,590 కోట్లు ఖర్చు చేశామని అన్నారు.. గతంలో పదవుల్లో ఉన్న వారు ఉత్తరాంధ్రకు ఏం చేశారని దేవినేని ఉమ ప్రశ్నించారు.. అప్పట్లో ప్రాజెక్టుల పేరుతో డబ్బులు కాజేసేందుకే ప్రయత్నించారని, పదేళ్లలో తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని అన్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో నీళ్లు ఇచ్చామని తెలిపారు.. అదే విధంగా ఉమా, జగన్ మీద విమర్శలు చేసారు.. జగన్ కి సీఎం కావాలనే పిచ్చి పట్టి రోడ్ల వెంట తిరుగుతున్నారని అన్నారు.. జగన్‌ అక్రమంగా సంపాదించిన ఆస్తులు ప్రజలవని, వాటిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.