TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్లీ పాదయాత్ర మూడ్‌లో జగన్

Published on: Sun Apr 6, 2025 7:53AM

ఎండలు తగ్గాక జనంలోకి?

వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వైసిపి నేతలు వరుసగా జైలు పాలు అవుతున్నారు. కొంతమంది వైసీపీ నేతలు ఏపీని వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి దాక్కుకుంటున్నారు. విజయసాయిరెడ్డి లాంటివారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి, సేఫ్ జోన్ లోకి వెళ్లారు.

 ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది.  కాబట్టి ఎలాగైనా పార్టీని కాపాడుకునేందుకు జగన్ బెంగళూరు ప్యాలెస్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారట . పార్టీ కీలక నేతలు, మరి కొంత మంది వైఎస్ కుటుంబ సభ్యులను పిలిపించుకొని జగన్ చర్చలు జరిపారంట. ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి?  ఎలా పార్టీని ముందుకు  తీసుకువెళ్లాలి అనే దానిపైన మంతనాలు సాగించారంట. చివరికి  ఏపీలో మరోసారి జగన్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారంట.

మరోసారి పాదయాత్ర నిర్వహిస్తే కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఓ నిర్ణయానికి వచ్చారట. మరో మూడు నెలల సమయం టిడిపి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత జగన్ జనాల్లోకి వెళ్లడానికి ఫిక్స్ అయ్యారంట. అంటే మాజీ ముఖ్యమంత్రి ఎండలు తగ్గాక రోడ్డెక్కుతారన్న మాట.