అసెంబ్లీకి విలువ ఉందా.. జగన్
Published on: Wed Dec 23, 2015 11:57AM

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంబేద్కర్ పై చర్చ అసలు అజెండాలోనే లేదని.. ఎన్నో సమస్యలు ఉన్నా ఐదు రోజులే సభ జరిపారు..అసెంబ్లీ సమావేశాలు పొడిగించాలని కోరినా పట్టించుకోలేదు.. ప్రజా సమస్యలపై చర్చించకుండానే సమావేశాలు ముగిశాయి.. అసలు అసెంబ్లీకి విలువ ఉందా? అని జగన్ ప్రశ్నించారు. కాల్ మనీ పై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంది...కాల్ మనీ సెక్స్ రాకెట్ చంద్రబాబు అండతోనే జరిగింది అని విమర్శించారు.


