TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆర్మూరు చేరుకున్నజగన్మోహన రెడ్డి

Published on: Tue Jan 10, 2012 7:38PM

ఆర్మూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి నిజాబాద్ జిల్లాలోని ఆర్మూరు గ్రామం చేరుకున్నారు. రైతుదీక్షా వేదిక ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ప్రాంగణానికి ఆయన రాత్రి 7.45 గంటలకు చేరుకున్నారు.కొండా సురేఖ జగన్కు తిలకం దిద్దారు. ఈ దీక్షకు రైతులతోపాటు అభిమానులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జగన్ వేదిక వద్దకు రాగానే దిక్కులు పిక్కటిల్లేలాగా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వేదిక మీద ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. వేదికపైన పార్టీ అగ్రనేతలు అందరూ ఉన్నారు. దీక్షకు రైతుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. అనంతరం ఆత్మహత్య చేసుకున్న రైతులకు, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు వదిలిన యువతకు జగన్ నివాళులర్పించారు.