TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సొంత దర్యాప్తు సంస్థ

Published on: Fri Jun 5, 2015 8:34AM


వైసీపీ నాయకుడు జగన్ ఎవరికీ ఉపయోగపడని రాజకీయాలు నడపడంతోపాటు  తనకు కావలసిన విధంగా రిపోర్టులు అందించే దర్యాప్తు సంస్థ లాంటిదాన్ని ఏర్పాటు గానీ చేసుకున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆ దర్యాప్తు సంస్థలు మాంఛి క్రియేటివిటీ వున్న రైటర్లు కూడా వున్నారా అనే డౌట్లు వస్తున్నాయి. ఎందుకంటే, ఆయన సొంత మీడియాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక కథనాలు వస్తూ వుంటాయి. ఆ కథనాల్లో ప్రతి విషయం మీద సీబీఐ లాంటి  పెద్ద దర్యాప్తు సంస్థ పరిశోధించిన లెవల్లో వివరాలు ఇస్తూ వుంటారు. కాకిలెక్కలు, ఇదిగో పులి అంటే అదిగో తోక  అనే వివరాలు కూడా సదరు కథనాల్లో కనిపిస్తూ వుంటాయి. మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చురుగ్గా వ్యవహరించిన సదరు దర్యాప్తు సంస్థ ఇప్పుడు తెలంగాణలో కూడా తన దర్యాప్తును ప్రారంభించినట్టు అనిపిస్తోంది.

మొన్నీమధ్య రేవంత్ రెడ్డి వ్యవహారం జరిగినప్పటి నుంచి జగన్ దర్యాప్తు సంస్థ చాలా యాక్టివ్ అయిపోయింది. ఆ కేసును దర్యాప్తు చేస్తున్న ఏసీబీ కంటే వేగంగా దర్యాప్తు చేసేస్తున్నట్టుంది. అందుకే ఈ అంశం మీద జగన్ మీడియాలో రోజుకు రెండు మూడు కథనాలు వండి వార్చి వడ్డించి కనిపిస్తున్నాయి. ఆ కథనాలు ఎవరైనా అమాయకులు చదివారంటే ముందూవెనుకా ఆలోచించకుండా నమ్మేసేంత పకడ్బందీగా వుంటున్నాయి. ఈ ఇష్యూలో ఉపయోగించిన డబ్బు  హైదరాబాద్‌లోని ఏ బ్యాంకులో డ్రా చేశారు. ఎంత డ్రా చేశారు. ఆ డబ్బు ఎవరి ఇంట్లో పెట్టారు. మిగతా డబ్బు ఏమైంది... ఇలా అసలు జగన్ దర్యాప్తు సంస్థ ప్రతినిధిని దగ్గర పెట్టుకుని ఈ వ్యవహారమంతా నడిపారా అనిపించేంత పకడ్బందీగా పులిహోర కథనాలు అందిస్తున్నారు. జగన్ ఇలా చంద్రబాబు మీద తలాతోకా లేని దర్యాప్తులు చేయకుండా తనమీద సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకు సహకరిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు.