జగన్ కోడికత్తి కేసు నిందితుడి బెయిల్ రద్దు !

 

ఏపీ సీఎం జగన్ మీద ఆయన ప్రతిపక్ష నేతగా ఉండగా గత ఏడాది కోడికత్తితో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన తర్వాత విశాఖలో ప్రధమ చికిత్స చేయించుకున్న జగన్ నేరుగా హైదరాబాద్ కు వెళ్లి, అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఈ వ్యక్తిని ప్రయోగించింది టీడీపీ అని వైసీపీ, లేదు సింపతీ కోసం వైసీపీనే చేయించుకుందని టీడీపీ ఆరోపించినిది. అయితే ఈ విషయం మెడ తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు  బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.

ఆ బృందం శ్రీనివాస్ అనే వ్యక్తి కావాలనే హత్యాయత్నం చేసినట్టు తేల్చింది. అయితే ఈ కేసు విషయంలో జగన్ కేంద్ర పెద్దల దగ్గరకు వెళ్ళడంతో ఈ కేసు  జాతీయ దర్యాప్తు సంస్థ చేతికి వెళ్ళింది. ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏ విచారణ చేసి ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలో విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ కు ఈ ఏడాది మే 22న బెయిల్ మంజూరు చేసింది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ కేసులో ఇంకా దర్యాప్తు పూర్తికానందున నిందితుడి బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం తరపున న్యాయవాది కోరారు. జగన్ మీద జరిగిన దాడి పౌర విమానయాన భద్రత చట్టం ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాల పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఈ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ప్రకారం బెయిల్‌ మంజూరుకు సరైన కారణాలు చెప్పాలనీ కానీ దిగువ కోర్టు అవేవీ పట్టించుకోకుండానే బెయిలు మన్జోఒరు చేసిందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. మరోపక్క శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వడం సమంజసమేనని, విచారణకి సహకరిస్తున్నాడని శ్రీనివాస్ తరపున నయాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శ్రీనివాస్ బెయిల్ ను రద్దుచేస్తూ తీర్పు ఇచ్చింది.