TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెవిరెడ్డి ఎక్కడ? జగన్ తో చెడిందా?

Published on: Fri Jul 24, 2026 2:47PM

వైసీపీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో.. ఎప్పుడు ఎవరికి అధ:పాతాళమే దిక్కౌతుందో తెలియని పరిస్థితి ఉంది. జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అండతో చెవిరెడ్డి పార్టీలో ఓ వెలుగు వెలిగారు. చెవిరెడ్డికి దక్కిన ప్రాధాన్యత వైసీపీలో మరెవరికీ దక్కలేదంటే అందులో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అటుంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  గత సార్వత్రిక ఎన్నికల్లో  ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సరిపెట్టకుండా, ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి మరీ పోటీకి దింపారు జగన్. అటువంటి చెవిరెడ్డిని జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. 

జగన్ అధికారంలో ఉండగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యంవిధానంరూపకల్పన దగ్గరనుంచి డిస్టిలరీల వరకూ చెవిరెడ్డి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కుంభకోణంపై ఈడీ దర్యాప్తుచేపట్టింది. అంతకు ముందే ఇదే కేసులో చెవిరెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలుపై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కుంభకోణం చెవిరెడ్డిని జగన్ కు దూరం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ దృష్టికి కూడా రాకుండా చెవిరెడ్డి తన సొంతంకోసం సొమ్ములు వెనకేశారనీ, సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన సందర్భంలో ఆ వివరాలు వెల్లడయ్యాయనీ  పార్టీ వర్గాల భోగట్టా. దీంతో మద్యం కుంభకోణం విషయంలో తన అనుకునన చెవిరెడ్డే తనను మోసం చేశారన్న అసంతృప్తితో జగన్ చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  

దీంతో ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే తరచుగా కనిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ తలుపులు బంద్ అయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే గత కొంత కాలంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ దరిదాపుల్లో కూడా నిలబడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగాఇటీవలి కాలంల ో పార్టీ సమావేశాలకు కూడా ఆయనఎంట్రీని జగన నిేధించరనిపేర్కొంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కే అవకాశాలు దాదాపు శూన్యమని పార్టీవర్గాలే చెబుతున్నాయి.  

Jagan keeps Chevireddy at a distance, Ap Liquor cam, Chevireddy Bhaskarreddy, Cheating