TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రమంతటా వైసీపీ పాము పిల్లలే!

Published on: Sun Jun 23, 2024 1:49PM

జగన్ అధికారంలో చేసిన ఘనకార్యం రుషికొండ ప్యాలెస్‌ ఇచ్చిన షాక్ నుంచి నుంచి ఆంధ్రప్రదేశ్ జనాలు తేరుకునే లోపే, ఈసారి పార్టీ ఆఫీసుల రూపంలో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఈ దిక్కుమాలిన వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా  వున్న 26 జిల్లాల్లో చాలా విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని, వాటిలో పార్టీ ఆఫీసుల పేరుతో ప్యాలెస్‌లను కడుతోంది. తాడేపల్లి ప్రాంతంలోని ప్రధాన కార్యాలయాన్ని కూలగొట్టిన తర్వాత, తల్లిపాముని చంపిన తర్వాత పుట్టలోంచి పిల్లపాములు బయటపడ్డట్టు, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆఫీసుల పేరుతో వైసీపీ చేసిన అక్రమాలు బయటకి వస్తున్నాయి. ఆ పిల్ల పాములను కూడా చంపాల్సిన అవసరం వుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వైసీపీ అక్రమ ఆఫీసుల వివరాలు ఇవిగో...

1. శ్రీకాకుళం జిల్లా: శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన వున్న రెండు కోట్ల విలువైన ఎకరంన్నర ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా వైసీపీ పార్టీ ఆఫీసుని కడుతున్నారు. దీని నిర్మాణం తుది దశలో వుంది.

2. విజయనగరం జిల్లా:  విజయనగరం మహారాజుల భూమిలో జగన్ పార్టీ పాగా వేసింది. మూడున్నర కోట్ల విలువ చేసే ఎకరం భూమిలో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మిస్తోంది. ఈ ఆఫీసు నిర్మాణం 85 శాతం పూర్తయింది.

3. పార్వతీపురం మన్యం జిల్లా:  గతంలో రైతు శిక్షణ కేంద్రాన్ని నిర్మించడానికి శంకుస్థాపన చేసిన రెండు కోట్ల విలువ చేసే ఎకరం పావు భూమి మీద జగన్ కన్ను పడింది. అంతే.. అనుమతులు లేకుండా వైసీపీ పార్టీ ఆఫీసు నిర్మాణం ప్రారంభమైపోయింది. ఇప్పుడు ఈ కట్టడం నిర్మాణం తుది దశలో వుంది.

4. విశాఖపట్నం జిల్లా:  రెవెన్యూ ఉద్యోగుల కోసం కేటాయించిన రెండెకరాల భూమిని జగన్ కాటేశాడు. ఈ భూమి విలువ అక్షరాలా వంద కోట్లు. అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మాణం పూర్తయింది. ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది.

5. అనకాపల్లి జిల్లా: కాపు భవనానికి శంకుస్థాపన చేసి, 50 లక్షలు కూడా కేటాయించిన 1.75 ఎకరాల భూమిని జగన్ పార్టీ సొంతం చేసుసుకుంది. ఈ భూమి విలువ 15 కోట్లు. ఈ భవనం నిర్మాణం పూర్తి చేసుకుంది. దీనికి కూడా ఎలాంటి అనుమతులు లేవు.

6. అల్లూరి సీతారామరాజు జిల్లా:  గిరిజనులు సాగు చేసుకునే రెండకరాల భూమిని వైసీపీ సొంతం చేసుకుంది. ఈ భూమి విలువ ఐదు కోట్లు. ఇది తమ సాగుభూమి అని గిరిజనులు అడ్డుకోవడంతో వైసీపీకి బ్రేకులు పడ్డాయి.  ప్రస్తుతం ఈ భూమి వివాదం కోర్టులో వుంది.

7. కాకినాడ జిల్లా: 22ఎ నిషేధిత భూముల జాబితాలో వున్న 1.93 ఎకరాల భూమిలో వైసీపీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. ఈ భూమి విలువ 75 లక్షలు. 

8. తూర్పు గోదావరి జిల్లా: ఆర్ అండ్ బి అతిథి గృహం వెనుక వున్న ఆర్ అండ్ బీకే చెందిన స్థలాన్ని వైసీపీ తన సొంతం చేసేసుకుంది. 45 కోట్ల విలువైన ఈ భూమిలో వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తయింది. సహజంగానే ఈ నిర్మాణానికీ అనుమతి లేదు.

9. అంబేద్కర్ కోనసీమ జిల్లా: పది కోట్ల విలువైన, ఒక ఎకరం మందబయలు చెరువుభూమిలో తన కార్యాలయాన్ని నిర్మించడానికి వైసీపీ ప్రయత్నించింది. అయితే ఈ భూమి వివాదం ఇప్పుడు కోర్టులో వుంది.

10. పశ్చిమ గోదావరి జిల్లా: ఏడు కోట్ల విలువైన 0.72 ఎకరాల విస్తీ్ర్ణం గల విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఉద్దేశించిన భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణానికి వైసీపీ పూనుకుంది. ఇక్కడ పనులు ప్రస్తుతం శ్లాబ్ వరకు చేరుకున్నాయి.

11. ఏలూరు జిల్లా: స్టేడియాన్ని నిర్మించే ప్రతిపాదన వున్న క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన ఐదు కోట్ల విలువైన రెండెకరాల భూమిని వైసీపీ కొట్టేసింది. అనుమతులు లేకుండా కార్యాలయాన్ని నిర్మించేసింది.

12. ఎన్టీఆర్ జిల్లా: గతంలో వాణిజ్య సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదించిన కార్మిక శాఖకు చెందిన 50 కోట్ల విలువైన ఎకరం భూమిని వైసీపీ సొంతం చేసేసుకుంది. ఇక్కడ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి చేసుకుంది.

13. కృష్ణా జిల్లా: మచిలీపట్నం కోర్టు సెంటర్లోని రద్దీ ప్రదేశంలో వున్న 60 కోట్ల విలువైన రెండెకరాల భూమిలో జగన్ తన పార్టీ కార్యకలాపాల కోసం ఇంద్రభవనం లాంటి భవంతిని నిర్మించారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు.

14. గుంటూరు జిల్లా: మొన్న కూలగొట్టిన భవనం ఈ జిల్లాలోదే. బోట్ యార్డుకు చెందిన రెండెకరాల భూమిలో  వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మించడానికి శ్లాబ్ కూడా వేశారు. అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వం కూలగొట్టింది.

15. పల్నాడు జిల్లా: కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం పక్కనే వున్న 22.50 కోట్ల విలువైన 1.50 ఎకరాల అగ్రహారం భూమిలో అనుమతులు లేకుండా పార్టీ ఆఫీసు నిర్మించారు.

16. బాపట్ల జిల్లా:  బైపాస్ రోడ్డు పక్కన ఆర్టీసీకి కేటాయించిన నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన 1.64 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ కార్యాలయం 90 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది.

17. ప్రకాశం జిల్లా: జాతీయ రహదారి పక్కనే వున్న జలవనరుల శాఖకు చెందిన 1.64 ఎకరాల భూమిలో పార్టీ కార్యాలయం నిర్మాణం ప్రారభమైంది. నాలుగున్నర కోట్ల విలువైన ఈ భూమిలో అనుమతులు తీసుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు.

18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: పది కోట్లు విలువైన టిడ్కో ఇళ్ళకు కేటాయించిన రెండు ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయం 90 శాతం నిర్మాణం పూర్తి చేసుకుంది.

19. కర్నూలు జిల్లా: వంద కోట్ల విలువైన 1.60 ఎకరాల భూమి. కర్నూలు నడిబొడ్డున వున్న ఈ భూమిని గతంలో ఏపీ ఆగ్రోస్ సంస్థకు కేటాయించారు. ఆ భూమిని జగన్ తన పార్టీకి మళ్ళించుకుని, ఎలాంటి అనుమతులు లేకుండా కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు.

20. నంద్యాల జిల్లా: జగనన్న కాలనీ పక్కనే వున్న ఏడు కోట్ల విలువ చేసే ఎకరం భూమిలో ఎలాంటి అనుమతులూ లేకుండా పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి పునాదులు వేశారు.

21. వైఎస్సార్ కడప జిల్లా: కడప ముఖద్వారం దగ్గర వున్న 30 కోట్ల విలువైన రెండెకరాల కమర్షియల్ భూమిని కొట్టేసి, అనుమతులు లేకుండా జగన్ నిర్మి్స్తున్ వైసీపీ కార్యాలయం నిర్మాణం పూర్తయ్యే దశలో వుంది.

22. అన్నమయ్య జిల్లా: ఇక్కడ గయాళు భూమిలో పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇటువంటి వాటికి భూమిని ఇవ్వకూడదు. అందువల్ల ఆ భూమిని రికార్డులలో ఏడబ్ల్యు భూమిగా మార్చి సొంతం చేసుకున్నారు. ఇక్కడ పార్టీ ఆఫీసు నిర్మాణం పూర్తయ్యే దశలో వుంది. అనుమతులు లేవు. 1.61 ఎకరాల విస్తీర్ణం వున్న ఈ భూమి విలువ 12 కోట్ల రూపాయలు.

23. అనంతపురం జిల్లా: జలవనరుల శాఖకు చెంది. 45 కోట్ల విలువైన 1.50 ఎకరాల భూమిలో అనుమతి లేకుండా నిర్మించిన వైసీపీ ఆఫీసు తుది మెరుగులు దిద్దుకుంటోంది.

24: శ్రీ సత్యసాయి జిల్లా: విమానాశ్రయం ఎదురుగా వున్న 20 కోట్ల విలువైన 1.30 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఆఫీసు పూర్తయ్యే దశలో వుంది.

25. తిరుపతి జిల్లా: విమానాశ్రయానికి సమీపంలో వున్న 14 కోట్ల విలువైన 2 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి చేశారు.

26: చిత్తూరు జిల్లా: ఇతరుల ఆధీనంలో వున్న 17 కోట్ల విలువైన 2 ఎకరాల భూమి మీద పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం జగన్ కన్నేశాడు. అనుమతులు లేకుండా నిర్మాణం ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ భూమి వివాదం కోర్టులో వుంది.

మొత్తమ్మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 677.50 కోట్ల విలువైన 42.24 ఎకరాల ప్రభుత్వ భూమిని జగన్ తన పార్టీ కార్యాలయ పేరుతో స్వాహా చేసేశాడు.