నేడు సిబిఐ ముందుకు వైయస్ జగన్
Published on: Fri May 25, 2012 9:34AM
అక్రమ ఆస్తుల కేసులో ప్రధాన ని౦దితుడైన వైయస్ జగన్ నేడు సిబిఐ విచారణకు హాజరుకానున్నారు. తన తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు సిబిఐ అభియోగం మోపింది. గుంటూరుజిల్లా ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ రాత్రి కారంపుడి మీదుగా రోడ్డు మార్గాన హైదరాబాద్ కి బయలుదేరారు. ప్రస్తుతం హైదరాబాద్ లోటస్ పౌండ్ లో ఉన్న జగన్ మరి కొద్దిసేపట్లో సిబిఐ ముందు హాజరుకానున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన జగన్ ను సిబిఐ మొదటిసారిగా విచారించనుంది. ఈ స్థితిలో హైదరాబాదు నగరంలో 144వ సెక్షన్ విధించారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి.


