దక్షత లేని దీక్షలు

 

 

 

సమన్యాయం చెయమనొ రాష్ట్రాన్ని సమైఖ్యంగానే ఉంచమనొ మొత్తం మీద రాష్ట్ర రాజధాని లో జగన్,అటు దేశ రాజధానిలో చంద్రబాబు నాయుడు నిరాహార దీక్షలు చేపట్టారు. జగన్ దీక్ష ప్రారంభించి ఐదు రోజులు ఐన కారణంగా ఆయన దీక్షను పోలీసులు గత రాత్రి భగ్నం చేశారు. నేడో,రేపో అక్కడ ఢిల్లీ లో బాబు గారి దీక్షను ఇలాగే అడ్డుకుంటారు. అయితే ఈ తతంగ మంత చూస్తున్న ప్రజానీకానికి ఒక్క విషయం అర్ధం కావటం లేదు. ఇటు జగన్ కాని అటు చంద్రబాబు కానీ తమ దీక్షలతో తమకు ఏమి న్యాయం చేయబుతున్నారా అని.ఒకనాడు రాష్ట్రాన్ని విభజించమని లేఖలు ఇచ్చిన ఈ ఇద్దరు నేతలు నేడు సమన్యాయం కోసం దీక్షలు చేపట్టట మేమిటని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు అఖిల పక్ష సమావేశం లో లేఖలు ఇచ్చిన నాడు సమన్యాయం ఎలా చేయ వచ్చో లేక విభజన అనంతరం సీమాంధ్ర లో తలెత్తే సమస్యలేమిటో ఎందుకు పేర్కొనలేదు.

 

 

అన్నిటికంటే ముఖ్యంగా రాజ్యాంగం లోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించమని లేఖ ఇచ్చిన జగన్ ఈరోజు ఎందుకు వరుసగా దీక్షలమీద దీక్షలు చేస్తున్నారు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు విజయమ్మ దీక్ష వలన గాని ఆతరువాత జైలులో నే జగన్ రెడ్డి ప్రారంభించిన దీక్ష వలన కానీ మళ్ళి ఐదు రోజుల క్రితం వరకు జగన్ రెడ్డి దీక్ష వలన ప్రజలకు ఒరిగిందేమిటి?ఇంకా వై.కా.పా లోనే కొంత మంది కొత్తనేతలు తమ రాజకీయ భవిష్యత్తు ను వెతుక్కొంటూ వచ్చి చేరారు తప్పా. ఇంత చేసినా కనీసం ఇప్పటికైనా ప్రజల తరఫున పోరాడాలి అంటే జగన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పట్ల తన వైఖరి ఏంటో చెప్పాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.2014 ఎన్నికలలో తిరిగి యు.పీ.ఎ  ప్రభుత్వానికే కనుక తన మద్దతు తెలియ చెబితే సీమాంధ్ర ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది.


                       

చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికైనా ఆయన వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఎన్ని దీక్షలు చేసి ఏమిటి ప్రయోజనం అని కూడా పలువురు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన పరిస్థితి ఇక్కడి వరకు రావటానికి ఆయన తప్పిదం కూడా చాలా ఉంది అనేది ఎవరు కాదనలేని సత్యం. నేడు ప్రజలకు కావాల్సింది నేతలనుండి స్పష్టమైన హామీ. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రాంతం లోని అన్ని పార్టీల నేతలు ప్రజల కోసం ఒక్కతాటి మీదకు వచ్చి ప్రజల పక్షాన నిలబడాలని ఎందుకు అనుకోరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఇరువురు నేతల కన్నా ప్రజలే నయం. 70 రోజులుగా జీతాలు లేకున్నా,కరెంటు ,నీళ్ళు,పాలు ఏవి లేకున్నా ఎంతో ఆత్మ స్థైర్యం తో పోరాడుతున్నారు,నేతలను వణికిస్తున్నారు. కానీ ఇంకా రాజకీయ లబ్ధి తోనే ఆలోచిస్తూ ప్రజల ఆందోళనలు గుర్తించకపోతే ఆయా పార్టీలకు రాజకీయ మనుగడ ఉండదు అనేది సుస్పష్టం. ఇహ మీదటైన ఈ నేతలు ఈ దక్షత లేని దీక్షలు చేపట్టకుండా ఉంటె మంచిదని ప్రజలే భావిస్తున్నారు.