జగన్ దీక్ష సమైక్యం కోసమేనా

 

Jagan hunger strike, Samaikyandhra Movement, Samaikyandhra, jagan mohan reddy, ysr congress, telangana

 

 

 

సీమంద్రాపై పట్టుకోసం తీవ్రంగా కృషిచేస్తున్న వైకాపా ఊహించినట్లుగానే సమైక్యాంధ్ర ఉద్యమాన్నిమరింత తీవ్రతరం చేయడం ద్వారా ఇంతవరకు పార్టీల వారిగా విడిపోయినప్పటికీ సమైక్యంగా ఉద్యమం చేస్తున్న ప్రజలను తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోంటునట్లు ప్రకటించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పైగా తనకంటే ఎంతో రాజకీయ అనుభవజ్ఞుడయిన చంద్రబాబుని, తెదేపాను కూడా తనతో ఉద్యమంలో కలిసి పనిచేయాలని కోరి అతితెలివి తేటలు ప్రదర్శించడం విశేషం. ఈవిధంగా తన రాజకీయ ప్రత్యర్ధిని కూడా ముగ్గులోకి లాగాలని ప్రయత్నిచడం ఆయనకు కొత్తేమి కాదు. గతంలో ఆయన తన పార్టీ శాసన సభ్యుల చేత రాజీనామాలు చేయించినపుడు, ఆ తరువాత తను, తన తల్లి విజయమ్మలు తమ పదవులకు రాజీనామాలు చేసినపుడు కూడా తేదేపాను ముగ్గులోకి లాగడానికి చేసినవే. తొలి ప్రయత్నంలో కొంత మేర సఫలమయినప్పటికీ, రెండో ప్రయత్నంలో మాత్రం చట్టసభలలో అడుగుపెట్టకుండా చేసుకొని పోరాపాతుచేసామని గ్రహించారు.

 

 

ఇక ఇప్పుడు తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రంపై ఆగ్రహంతో ఉన్నప్రజలతో మమేకం అవడం ద్వారా వారిలోకి తేలికగా చొచ్చుకుపోవచ్చుననే ఆలోచన కనబడుతోంది. అయితే ఈరోజుల్లో ఆమరణ నిరాహారదీక్షలు ఏరకంగా ముగుస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అందుకు ఆయన తల్లి విజయమ్మ చేసిన ‘ఐదు రోజుల ఆమరణ నిరాహార దీక్ష’,  అతను స్వయంగా జైల్లో చేసిన ‘ఆరు రోజుల ఆమరణ నిరాహార దీక్షలే ఇందుకు మంచి ఉదాహరణలు. రేపు ఆయన మొదలుపేట్టబోయే దీక్ష కూడా ఈవిధంగానే ముగిసే అవకాశం ఉంది. అదేవిధంగా తన ఆమరణ నిరాహార దీక్షతో కేంద్రం నిర్ణయం మార్చుకోదని జగన్ కు తెలియకపోదు. అందువల్ల ఇది సీమంధ్ర ప్రజలను తన పార్టీ వైపు తిప్పుకోవడానికి చేస్తున్న దీక్షగానే భావించవలసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఒకపక్క నీతి నిజాయితీ అని మాట్లాడుతూ మరో వైపు ఇటువంటి దురాలోచనలు చేయడం వలన ముందుగా ఆయనే మరో మారు ‘విశ్వసనీయత’ కోల్పోతారని గ్రహించాలి.