రంగుల పంచాయితీ.. నేడే సుప్రీంకోర్టులో విచారణ
Published on: Wed Jun 3, 2020 10:02AM
ఏపీలో పంచాయతీ భవనాలకు రంగుల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది.
గతంలో కూడా పంచాయతీ భవనాలకు పార్టీ రంగులు వేయకూడదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అయినా జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. మూడు రంగులకు అదనంగా మరో రంగును కలిపి జీవో తీసుకొచ్చింది. దానిపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరో రంగును కలిపి మళ్లీ పార్టీ రంగులే వేస్తున్నారంటూ పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో రంగును కలుపుతూ జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవోను రద్దు చేసింది. అయినా జగన్ సర్కార్ పట్టు వీడటం లేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈరోజ విచారణ జరగనుంది. మరి ఈసారి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.


