TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ సర్కారు తుస్సు.. కొనలేదు ఒక్క బస్సు!

Published on: Thu Aug 8, 2024 12:59PM

జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ ఆర్టీసీ కోసం ఒక్క బస్సు కూడా కొనలేదని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. ఏలూరు నుంచి దూరప్రాంతాలకు వెళ్ళే 30 సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ స్లీపర్ బస్సులను మంత్రి గురువారం నాడు ప్రారంభించారు. అనంతరం ఏలూరు బస్సు డిపో ఆవరణలో మొక్కని నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘‘జగన్ సంక్షేమం పేరు చెబుతూ అభివృద్ధిని గాలికి వదిలేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు 1400 కొత్త బస్సులను కొన్నాం. ఆర్టీసీని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఆర్టీసి కార్మికుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం’’ అన్నారు.