వామ్మో.. జగన్ ఫోటోకి దండేసి..దండం పెట్టేశారు..
Published on: Wed Jan 12, 2022 10:30AM
ఎవరైనా పోతే.. వారి ఫోటోకి దండేసి దండం పెట్టేస్తారు. బతికున్న వారి ఫోటోలకు దండేసే సంస్కృతి ఏ మతంలోనూ లేదు. సినిమా హీరోల్లాంటి వారికి కూడా కటౌట్లు.. ఫ్లెక్సీలకు దండలేస్తారు కానీ.. ఫోటో ఫ్రేమ్‌లకు వేయరు. కానీ, బతికుండగానే జగనన్న ఫోటోకి దండేశారు. దండం కూడా పెట్టేశారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపల్ ఆఫీసులో కొందరు ముఖ్యమంత్రి జగన్ ఫొటోకు దండేసి.. పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వాళ్లంతా జగనన్నపై అభిమానంతోనే ఇలా చేశారు. అది ఓవరాక్షన్ అని.. అమంగళమని.. వారు గుర్తించలేకపోయారు. ఎంతైన వైసీపీ వాళ్లు, జగన్ అభిమానులంతా ఇలా అతి చేసేవాళ్లేగా అంటున్నారు. ఆ అతి.. మరింత అతిగా మారి.. ఇలా శృతిమించిందని సెటైర్లు వేస్తున్నారు. బతికుండగానే తన ఫోటోకి దండేసే ఫోటోలు చూసి.. జగన్ ఊ అంటారో? లేక, ఊఊ అంటారో మరి...!!


