అసెంబ్లీలో జగన్ కామెంట్స్... హత్యల సంఖ్యదేముందిలే...
Published on: Fri Aug 22, 2014 6:08PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం ఎమ్మెల్యేలను ‘‘బఫూన్లు’’ అని వ్యాఖ్యానించి వివాదాన్ని సృష్టించిన వైసీపీ నాయకుడు జగన్ ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. హత్యల సంఖ్య పైన తాను సభను తప్పుదారి పట్టించలేదని, అయినా హత్యల సంఖ్య ఎంతయితే ఏంటని, సమస్యను మానవతా దృక్పథంతో చూడాలని జగన్ అన్నారు. హత్యల వైసీపీ చెప్పే సంఖ్యకు, సాక్షి పత్రిక ప్రచురించిన సంఖ్యకు తేడా ఉంది కదా అని విలేకరులు ప్రశ్నించినప్పుడు ‘‘సంఖ్యలదేముందిలే’’ అని తేలిగ్గా తీసుకున్నట్టుగా జగన్ మాట్లాడారు. తాను తెలుగుదేశం సభ్యులను ‘బఫూన్లు’ అనడాన్ని జగన్ సమర్థించుకున్నారు.


