TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఆస్తుల కేసు: రెండు రోజుల సిబిఐ కస్టడికి హైకోర్ట్ అనుమతి

Published on: Fri Jun 8, 2012 6:34PM

jagan cbi custody, jagan cbi case, jagan cbi case latest news, jagan in jail   వైఎస్ జగన్‌ను రెండు రోజులు పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు నేడు అనుమతించింది. జగన్ కస్టడీ పొడిగింపుపై సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవిస్తు జగన్ ను రెండు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈనెల 9, 10 తేదీల్లో ఆయనను ఇద్దరు న్యాయమూర్తుల సమక్షంలో విచారించేందుకు కోర్ట్ అ౦గీకరించింది. నిన్న మూడు రోజులు కస్టడీ పోడగించాలంటు లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఐదు రోజుల కస్టడీలో చాలామంది సాక్ష్యులను సిబిఐ విచారించామన్నారు. జగన్‌ను ఎన్నిసార్లు ప్రశ్నించినా పొంతన లేని సమాధానాలు ఇచ్చారని తెలిపారు. రాష్ట్రం, ఇతర రాష్ట్రాలు విదేశాలలో నేరం జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయన్నారు. విదేశీ కంపెనీల నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులపై ఆరా తీయాల్సి ఉందన్నారు.