TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

5 రోజుల సిబిఐ కస్టడీకి వైయస్ జగన్

Published on: Sat Jun 2, 2012 4:37PM

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. జగన్‌ను ప్రతి రోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారించాలని, విచారణ ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో జరగాలని హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నెల 3వ తేదీ నుంచి ఏడో తేదీ వరకు జగన్‌ను విచారించడానికి హైకోర్టు సిబిఐకి అనుమతించింది. ఏడో తేదీ సాయంత్రం గానీ, 8వ తేదీ ఉదయం గానీ జగన్‌ను కోర్టులో హాజరు పరచాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిబిఐ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించి౦ది.