నేడు కోర్ట్ విచారణ లో జగన్ కు ఊరట లభిస్తుందా?

 

అక్రమాస్తుల కేసులో ప్రతి వారం జగన్ కోర్టుకు రావల్సిందే అంటూ సిబిఐ వేసినా కౌంటర్ పిటిషన్ పై కాసేపట్లో విచారణ మొదలు కాబోతోంది. ప్రతి వారం హాజరు మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే సీబీఐ కోర్టులో రెండు సార్లు, హైకోర్టులో ఒకసారి పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ లను కోర్టులు తిరస్కరించాయి. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ఎన్నికైన తరువాత వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ మరో పిటిషన్ ను సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారనీ ప్రతి వారం కోర్టుకు హాజరు కావడం వీలు కాదని మినహాయింపు ఇవ్వాలని కోర్టును పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో సీబీఐ స్ట్రాంగ్ కౌంటర్ దాఖలు చేసింది.

గతంలో అరెస్టై జైల్లో ఉన్నప్పుడే సాక్షుల్ని ప్రభావితం చేయటానికి జగన్ ప్రయత్నించారని అప్పట్లో ఎంపీ మాత్రమేనని ఇప్పుడు సీఎం అయినందున సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోర్టు దృష్టికి సిబిఐ తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇవాళ్టి విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ మోహన్ రెడ్డి తరపున దాఖలు చేసిన పిటీషన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు దానికి సీబీఐ ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అన్నది ఇప్పుటికే చర్చ నీయాంశంగా మారి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

వీటికి సంబంధించి సీబీఐ కూడా చాలా కౌంటర్ పిటిషన్ లో కొన్ని కీలక అంశాలను హై కోర్టు దృష్టికి తీసుకురావటం జరిగింది. గతంలో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఏ అంశాలనైతే కోర్టు చెప్పిందో అవి తప్పని సరిగా పాటించాలని సీబీఐ వాదించింది. ఈ రోజు విచారణలో జగన్ కు ఏమైనా ఊరట వస్తుందో లేదో లేక సీబీఐ కౌంటర్లకు కోర్టు విలువనిస్తుందో అనేది చర్చనీయాంశంగా మారింది.