ఐఏఎస్ శ్రీలక్ష్మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్..
Published on: Thu Sep 23, 2021 6:52PM
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ శ్రీలక్ష్మీపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసు విచారణకు రానందుకు శ్రీలక్ష్మీకి ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ జరిగింది.
పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు జి.వెంకట్రామిరెడ్డి హాజరైయ్యారు. రిటైర్డ్ ఐఏఎస్ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్ చేసింది. వాన్‌పిక్ కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి హాజరుకాలేదు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు రాకుంటే ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం హెచ్చరిచింది. జగన్, విజయసాయి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్, దాల్మియా కేసుల విచారణ ఈనెల 30కి కోర్టు వాయిదా వేసింది. అలాగే జగతి పబ్లికేషన్స్, పెన్నా సిమెంట్స్ కేసుల విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.


