'సాయి రెడ్డి అరెస్ట్'..అరెస్టుల పర్వానికి ఒక సూచిక
Published on: Tue Jan 3, 2012 1:39PM
హైద
రాబాద్:జగన్ అక్రమ ఆస్తుల కేసులో అరెస్టయిన విజయసాయి రెడ్డిది అరెస్టుల పర్వానికి ఒక సూచిక అని ఆరోగ్యశాఖామంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు.సహజ వనరులను జగన్ ఎలా దోచుకున్నాడో, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రావలసిన ధనాన్ని ఎలా దారి మళ్లించారో సాక్ష్యాధారాలతో సహా సీబీఐ నిరూపిస్తుందని డీఎల్ అన్నారు.ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన ప్రతి వ్యక్తి రాష్ట్ర ఖజానాకు గండికొట్టినవారేనని చెప్పుకొచ్చారు. వారందరినీ సీబీఐ ఎట్టి పరిస్థితుల్లో వదలదనీ, అందరినీ అరెస్టు చేస్తుందని అన్నారు.


