TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీనియ‌ర్ల‌కు డిమోష‌న్‌.. మ‌హిళ‌ల‌కు కీల‌కం.. కొత్త‌ మంత్రుల శాఖ‌లివే..

Published on: Mon Apr 11, 2022 4:26PM

కొత్త మంత్రుల‌కు శాఖ‌లు కేటాయించారు సీఎం జ‌గ‌న్‌. ఆ శాఖ‌ల కూర్పు ఆస‌క్తిక‌రంగా సాగింది. మ‌రోసారి ఐదుగిరికి డిప్యూటీ సీఎం ప‌ద‌వులు వ‌రించాయి. ఈసారి కూడా దళిత మహిళకు హోంశాఖ కేటాయించారు.  మేక‌పాటి నిర్వ‌హించిన శాఖ‌ల‌ను విభ‌జించారు. బుగ్గ‌నపై మ‌రోసారి న‌మ్మ‌కం ఉంచారు. బొత్స‌, పెద్దిరెడ్డిల‌కు డిమోష‌న్ ఇచ్చారు. అంజాద్‌ బాషా, రాజన్న దొర, ముత్యాలనాయుడు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామిల‌కు డిప్యూటీ సీఎంలుగా నియ‌మించారు సీఎం జ‌గ‌న్‌. మంత్రుల‌కు కేటాయించిన శాఖ‌లు ఇవే...

రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు- ధర్మాన ప్రసాదరావు
సీదిరి అప్పలరాజు- మత్స్య, పశు సంవర్థకశాఖ
బొత్స సత్యనారాయణ- విద్యాశాఖ
రాజన్నదొర- గిరిజన సంక్షేమశాఖ, డిప్యూటీ సీఎం
గుడివాడ అమర్నాథ్‌- పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడులు, వాణిజ్యశాఖ


ముత్యాలనాయుడు- పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, డిప్యూటీ సీఎం
దాడిశెట్టి రాజా- రోడ్లు, భవనాలశాఖ
పినిపె విశ్వరూప్‌- రవాణాశాఖ
వేణుగోపాలకృష్ణ- బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, ఐఅండ్‌పీఆర్‌
తానేటి వనిత- హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ

కారుమూరి నాగేశ్వరరావు- పౌర సరఫరాలు, వినియోగదారులశాఖ
కొట్టు సత్యనారాయణ- డిప్యూటీ సీఎం, దేవాదాయశాఖ
జోగి రమేష్‌- గృహ నిర్మాణం
మేరుగ నాగార్జున- సాంఘిక సంక్షేమం
విడదల రజిని- వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య
అంబటి రాంబాబు- జలవనరులశాఖ

ఆదిమూలపు సురేష్‌- మున్సిపల్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌
కాకాని గోవర్థన్‌రెడ్డి- వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్‌
పెద్దిరెడ్డి- విద్యుత్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం
ఆర్కే రోజా- టూరిజం, సాంస్కృతిక, యువజనశాఖ
అంజాద్‌ బాషా- డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
బుగ్గన రాజేంద్రనాథ్‌- ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్యపన్నులు, అసెంబ్లీ