మరోసారి తాడేపల్లికి జగన్ చుట్టపుచూపు!
Published on: Tue Oct 8, 2024 1:22PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేడు బెంగళూరు నుంచి విజయవాడకు రానున్నారు. ఇటీవల మరణించిన విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయ ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు చేరుకుంటారు. తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ నేతలతో సమావేశమౌతారు. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ పుంగనూరు పర్యటన రద్దైన తరువాత ఈ షెడ్యూల్ ఖరారైందని చెబుతున్నారు.


