వైఎస్ జగన్ బెయిల్ కు షరతులు

 

గత 16 నెలలుగా అక్రమాస్తుల కేసులో చంచల్ గూడా జైలులో నిర్భంధించబడ్డ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు సీబీఐ కోర్టు షరతుల కూడిన బెయిలు మంజూరు చేసింది. అతనిని హైదరాబాద్ విడిచి బయటకి వెళ్లరాదని, అదేవిధంగా ఈ కేసుతో సంబంధం ఉన్నసాక్షులెవరితో మాట్లాడటం కానీ, వారిని ప్రబావితం చేయడం గానీ చేయరాదని ఆదేశించింది. ఒకవేళ అతను షరతులను ఉల్లంఘించినట్లయితే వెంటనే బెయిలు రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. రూ. 2లక్షల చొప్పున ఇద్దరు వ్యక్తులు రెండు పూచీకత్తులను కోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. ఈ రోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి బెయిలు వస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నఅతని లాయర్లు బెయిలు కోసం కోర్టుకి సమర్పించవలసిన అన్ని కాగితాలను ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచారు. అయితే చంచల్ గూడా జైలు కార్యాలయ సమయం ఐదు గంటలకే పూర్తవడంతో, రేపు ఉదయం 10-11గంటల మధ్య జగన్మోహన్ రెడ్డి జైలు నుండి విడుదల అయ్యే అవకాశం ఉంది.