కుదిరిన డీల్, జ‌గ‌న్‌కు బెయిల్‌

 

16 నెల‌లుగా చంచ‌ల్‌గూడ జైళులో ఉంటున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి ఎట్టకేల‌కు బెయిల్ మంజూరు అయింది. ప‌ట్టువ‌ద‌లని విక్ర‌మార్కుడిలా తొమ్మిది సార్లు బెయిల్ కోసం కోర్టు మెట్టెక్కిన జ‌గ‌న్ చివ‌ర‌కు అనుకున్నది సాదించాడు. అయితే చాలా రోజులుగా కేసు విష‌యంలో ఎంతో బలంగా ఉన్న సిబిఐ గ‌త కొద్ది రోజులుగా దూకుడు తగ్గించింది. ఆక‌వాల‌నే జ‌గ‌న్‌కు బెయిల్ వ‌చ్చే విధంగా చేసింద‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి.

ప్రస్థుతం రాష్ట్రంలో నెల‌కొన్న ప్రత్యేక ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌గ‌న్‌కు బెయిల్ రావడం ప్రాదాన్యం సంత‌రించుకుంది. అయితే జ‌గ‌న్‌కు బెయిల్ రావ‌డం వెనుక కాంగ్రెస్ హ‌స్తం ఉంది అన్న ఆరోప‌ణ కూడా ఉంది. తెలంగాణ ప్రక‌ట‌న నేప‌ధ్యంలో సీమాంద్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప‌రిస్థితి ఏర్పాండింది ఈ నేప‌ధ్యంలో సీమాంద్ర రాజీనామాల‌తో మంచి ఫామ్‌లో ఉన్న వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌తో పెత్తు పెట్టుకుంటే అక్కడ మంచి ఫ‌లితాలు రాబ‌ట్టవ‌చ్చని కాంగ్రెస్ భావిస్తుంది.

దీంతో పాటు తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌తో తెలంగాణ ప్రాంతంలో కూడా వీలైన‌న్ని ఎక్కువ స్ధానాలు గెలుచుకోని మ‌రోసారి యుపిఏ ప్రభుత్వాని ఏర్పాటు చేసేదిశ‌గా కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతుంది. సిబిఐ ఎంక్వయిరీలో వేగం త‌గ్గడం, దాదాపు ఎనిమిది కేసుల్లో క్విడ్‌ప్రోకో జ‌రిగిన‌ట్టుగా ఆదారాలు లేవ‌ని సిబిఐ కోర్టుకు తెల‌ప‌టం లాంటి ప‌రిణామాలలో జ‌గ‌న్ బెయిల్‌కు మార్గం సుగ‌మం అయింది. ప్రస్తుతం కాంగ్రెస్, వైయ‌స్ ఆర్ కాంగ్రెస్‌ల మ‌ద్య కుదిరిన ఒప్పందాల‌ను ఇరు పార్టీలు అంగీక‌రించ‌క‌పోయినా , ఎల‌క్షన్స్ స‌మ‌యానికి స‌మీక‌ర‌ణాలు అలాగే మారే అవ‌కాశం ఉందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.