జగన్ బెయిల్ డీల్..!!

 

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి బెయిలుకు తెరవెనుక రంగం సిద్ధమవుతోందనే అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తమవుతున్నాయి. మంగళవారం జగన్ కేసులో సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయడం...మరుసటి రోజు జగన్ బెయిల్ కోసం పిటిషన్ వేయడంతో ఒక్కసారిగా జగన్ మళ్ళీ వార్తల్లోకెక్కారు.

 

 

తాజాగా జగన్ బెయిల్ పై కాంగ్రెస్‌తో 'డీల్' కుదిరిందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ అధినాయకత్వంతో విజయమ్మ, భారతిలు చేసిన లాబియింగ్ అనంతర పరిణామాలే.... జగన్ బయటకు వస్తారనే ప్రచారం రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.

 

 

ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీకి ఎదురవుతున్న సవాళ్ళు...కాంగ్రెస్ తో వార్ ఫలితాలు నేర్పిన పాటాలు ఆయన్నీ ఒక పక్క ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే మరోవైపు సిబిఐని కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకార చర్యలకు ప్రయోగిస్తోందంటూ వైకాపా అధికార ప్రతినిధులు, జగన్ కుటుంబ సభ్యులు ఊరూవాడ ప్రచారం చేస్తున్నారు..అయినా ఫలితం లేకపోవటంతో...చివరికి రాజకీయ లక్ష్యం ఎలా వున్నా, కేసులా నుంచి బయటపడితే చాలు అనే స్థితికి జగన్& పార్టీ వచ్చాయి. మారిన వైకాపా వైఖరిని గమనించి కాంగ్రెస్ అధిష్టానం కూడా భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం లౌక్యాన్ని ప్రదర్శిస్తోంది.

 

 

అయితే మొన్నటిదాకా జగన్‌కు సీబీఐ కేసుల్లో బెయిల్ వచ్చినట్లయితే, వెంటనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుందని... జగన్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తరలిస్తుందని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడంలేదని చెప్పవచ్చు. జగన్ ఆస్తులను స్తంభింపచేస్తూ వచ్చిన ఈడీ ఇప్పుడు చప్పుడు చేయడం లేదు. మొత్తం మీద జగన్ 15 నెలలు గడపిన జైలు జీవితం ముగింపుకు వచ్చినట్లే నని అంటున్నారు విశ్లేషకులు.