జగన్ కేసులో కదిలిన ఆదాయపన్నుశాఖ?
Published on: Fri Jun 1, 2012 11:27AM
ఇప్పటిదాకా స్తబ్దుగా ఉన్న ఆడాయపంనుశాఖ జగన్ అక్రమాస్తుల కేసులో తన వంతు పాత్ర పోషించేందుకు సిద్ధమైందని సమాచారం. ఇడి. సిబీఐ చేస్తున్న దర్యాప్తులను పరిశీలించిన తరువాత ఆడాయపంనుశాఖ తమ సమాచారాన్ని బహిర్గతంగా ఉంచటంతో పాటు శాఖాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే అంశంపై తమ న్యాయనిపుణులను సంప్రదించింది. ప్రధానంగా తమ కళ్ళు గప్పే జగన్ ఇన్ని ఆస్తులు కూడబెట్టినందున చర్య కూడా అదే తీరులో ఉండాలన్నది ఆదాయపన్నుశాఖ పెద్దల ఆలోచన. అందుకని ముందస్తుగా తమ శాఖ తరుపున సమాచారాన్ని సిబీఐ కి, ఇడీకి తెలియజేసింది. ఆ తరువాత ప్రాథమిక విచారణ కూడా నిర్వహించింది. అందులో 2008-09లో కేవలం రూ. 2.92 లక్షల ఆదాయపన్ను కట్టిన జగన్ 2009-10లో రూ. 6.7లక్షలు, 2010-11లో ఏకంగా అడ్వాన్స్ టాక్స్ రూపంలో రూ. 84కోట్లను చెల్లించారు. ఇంత తక్కువ కాలంలో అంత ఎక్కువ టాక్స్ ఎలా చేల్లిన్చారనే అంశంపై ఆదాయపన్నుశాఖ విచారణ జరుపుతోంది


