TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ వెనుక కాంగ్రెస్

Published on: Tue Sep 17, 2013 1:04PM

 

Jagan assets case, Jagan assets case UPA , TDP Jagan assets case

 

వైఎస్ఆర్. కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుపై మరోసారి పోరాడేందుకు టిడిపి పార్టీ ఎంపీలు ఢిల్లీలో మకాం వేశారు. మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఒకటి గంటలకు ఈడి, సాయంత్రం ఐదు గంటలకు సిబిఐ డైరెక్టర్‌తో ఎంపీలు భేటీ కానున్నారు. జగన్ ఆస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని కోరనున్నారు.

 

 

జగన్ ఆస్తుల కేసు విషయమై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌ను కలిసిన అనంతరం ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు మాట్లాడారు. జగన్ కేసు దర్యాఫ్తును వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. హవాలా మార్గంలో నల్లధనంపై ఆరోపణలు వస్తే ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తాము సివిసి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. దర్యాఫ్తును వేగవంతం చేసేందుకు విచారణ అధికారులకు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణలో తేలిన అక్రమాస్తులకు, జప్థు చేసిన ఆస్తులకు ఏమాత్రం పొంతన లేదన్నారు. కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలిసిపోతాయని భావిస్తున్న విధంగానే జరుగుతోందని నామా వ్యాఖ్యానించారు.