జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కాదు: సిబిఐ

 

 

 jagan assets case, jagan jail, jagan remand, jagan mohan reddy cbi

 

 

చంచల్ గూడ జైల్లో వున్న జగన్ కి కోర్ట్ ఈనెల 27వరకు రిమాండ్ పొడిగించింది . ప్రతి పద్నాలు రోజులకు ఓసారి రిమాండును పొడిగిస్తున్నారని జగన్ తరపు న్యాయవాది ఆక్షేపించారు. సిబిఐ తన దర్యాఫ్తును ఎప్పుడు పూర్తి చేస్తోందో? ఎప్పుడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేస్తుందో? తెలియకుండా ఉందన్నారు. సిబిఐ తన ఆఖరి ఛార్జీషీట్ ఎప్పుడు దాఖలు చేయనుందో? దర్యాఫ్తు ఎప్పుడు పూర్తి చేస్తారో? స్పష్టంగా చెప్పాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో సిబిఐని ప్రశ్నించారు.దీంతో జగన్ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన మెమో దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.


జగన్ కేసుకు సంబంధించి ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి అయ్యాక ఒకే చార్జీ షీటును తయారు చేసి కోర్టుకు దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కేసేమీ కాదని, ఆయన కూడా సాధారణ వ్యక్తి కాదని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. జగన్‌కు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, జగన్ జైల్లో ఉంటేనే కేసును స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతామని సీబీఐ పేర్కొంది.