జగన్ ఆస్తుల కేసు: మంత్రులకి ప్రభుత్వం న్యాయ సహాయం
Published on: Sat Jul 7, 2012 3:01PM
వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మంత్రులలో నలుగురికి న్యాయ సహాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉదయం జీవోను జారీ చేసింది. వివాదాస్పదమైన 26 జీవోలపై సుప్రీం నుంచి నోటీసులు అందుకున్న మంత్రులకు మంత్రుల తరపున లాయర్లకు ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మీనారాయణ, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డిలకు ప్రభుత్వం ఆయా శాఖల పద్దుల నుంచి ఫీజు చెల్లించనుంది. కాగా జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే అరస్టయి జైల్లో ఉన్న మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐటీ (ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ) శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలకు న్యాయ సహాయ అభ్యర్థనకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదించనట్లు తెలుస్తోంది.


