TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'ఆదాయంలో అమెరికా అధ్యక్షున్ని మించిన జగన్'

Published on: Thu May 31, 2012 12:21PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆస్తులు రూ. 43కోట్లే. మరి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కట్టిన పన్ను 370కోట్ల రూపాయలు అని అంచనా. అంటే ఒబామా ఆస్తుల కన్నా జగన్ కట్టిన పన్నులు తొమ్మిది శాతం అధికమన్నమాట. ఇంత ఆస్తులు ఎలా వచ్చాయి? అన్న ప్రశ్న అందరినీ వేధిస్తోందని దండోరా రాష్ట్ర అధ్యక్షుడు మందా కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షున్ని తలదన్నేలా పన్నులు చెల్లించిన జగన్ కు ఎటువంటి శిక్ష విధించినా తప్పులేదన్నారు. ఉరిశిక్ష వేసినా అది ఏమంత పెద్ద శిక్ష కాబోదన్నారు. సిబీఐ ఇతర మంత్రులను కూడా వదలకుండా శిక్షించాలని డిమాండు చేశారు. ప్రజాధనాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సిబీఐ సక్రమంగా వినియోగించుకోవాలని మందా కోరారు. అయితే మందా కృష్ణ మాదిగ కూడా ఏమీ తక్కువ తినలేదని వై.ఎస్.ఆర్. రాజశేఖర రెడ్డి హయాంలో అతను కూడా అపారంగా ఆర్జించాడని, అతని అక్రమ ఆస్తులపై కూడా విచారణ జరిపి అరెస్ట్ చేయాలని ప్రత్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.