TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైఎస్ జగన్ ను నాంపల్లి కోర్టుకు తరలించిన సిబిఐ

Published on: Mon May 28, 2012 10:57AM

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు సోమవారం ఉదయం దిల్కుశ అతిథిగృహం నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించారు. అంతకు ముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 ప్లాటూన్లను రంగంలోకి దింపారు. కాగా ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఆంక్షలు పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు.