TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ అరెస్టు అన్యాయమంటూ సాక్షి బుక్ లెట్ లు?

Published on: Tue Jun 12, 2012 9:29AM

 jagan arrest, jagan in jail, jagan cbi custody, jagan cbi caseరాష్ట్రంలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచేందుకు సాక్షి పత్రిక ముద్రించిన బుక్ లెట్ లు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటుతున్నాయి. అలాగే జగన్ అరెస్టు అక్రమమంటూ ఆర్ధికనేరాలతో ఆయనకేమీ సంబంధం లేదంటూ పలురకాల వ్యాసాలను ఈ బుక్ లెట్ లో భాగంగా ముద్రించారు. ఇంతటితో ఆగకుండా సిబీఐ సోనియా చేతుల్లో విశ్వాసం ఉన్న ఓ ఏజెన్సీగా అభివర్ణిస్తూ పలురకాల వ్యాసాలూ అందులో కనిపిస్తున్నాయి. అందమైన రంగుల్లో కవర్ పేజీ వేసి మరీ ఈ బుక్ లెట్ ను విడుదల చేస్తున్నారు. ఈ బుక్ లెట్ ఈనాడు ముద్రించిన జగన్ ఆస్తుల విలువకు పూర్తి వ్యతిరేకమైన ఆధారాలతో రూపొందించినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకోండి. అయితే ఈ విషయంలో జగన్ కు తగిలిన మరో షాక్ ఏమిటంటే ఈ బుక్ లెట్ లను లక్ష కాపీలు ముద్రించి విడుదల చేసే సమయంలో రాజమండ్రి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో గమ్మత్తు ఏమిటంటే మరో లక్షన్నర కాపీలు ముద్రణలో ఉన్నాయని తెలుసుకున్న పోలీసుల వాటి కోసం ఎదురుచూస్తున్నారు.