అ సానుభూతి దీర్ఘకాలం ఉండదు :జెసి
Published on: Wed Jan 4, 2012 3:01PM
హైద
రాబాద్: జగన్‌ను అరెస్టు చేస్తే ఆయన పార్టీకి సానుభూతి వస్తుందనేది వాస్తవమేనని, ఆ సానుభూతి దీర్ఘకాలం ఉండదని, అయినా దాంతో తమ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌ను కాంగ్రెసు వేధిస్తోందని చెప్పడం వాస్తవం కాదన్నారు. సిబిఐ కాంగ్రెసు సూచనల మేరకే పని చేస్తుందన్న జగన్, పరిటాల రవి హత్య కేసులో ఆయనకు క్లీన్ చిట్ వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు. హైకోర్టు ఆదేశాలతోనే సిబిఐ విచారణ జరుగుతోందని, కేంద్రం జోక్యం లేదన్నారు. జగన్ ఎమ్మెల్యేలపై వేటు ఆలస్యమౌతోందన్నారు. ఆలస్యానికి కారణం స్పీకర్ సమాధానం చెప్పాలన్నారు.
జగన్ ఫీజు ధర్నా రాజకీయ లబ్ధి కోసమేనని కాంగ్రెసు పార్టీ శాసన మండలి విప్ నేత శివ రామి రెడ్డి వేరుగా అన్నారు. అర్హులైన అందరికీ కాంగ్రెసు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తుందన్నారు. జగన్ పోరు చేసినంత మాత్రాన విద్యార్థులు నమ్మరన్నారు. జగన్ వర్గం శాసనమండలి సభ్యులపై నాలుగైదు రోజ్లులో శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. పూర్తి ఆధారాలు సేకరించాకే ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.


