విజ‌య‌సాయిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన జ‌గ‌న్‌!.. ఢిల్లీ టూర్‌తో ఫుల్ క్లారిటీ!

posted on: Jan 6, 2022 5:41PM

జ‌గ‌న్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డిల మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింద‌ని ఎప్ప‌టినుంచో అంటున్నారు. లెటెస్ట్‌గా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌తో ఆ విష‌యంలో మ‌రింత క్లారిటీ వ‌చ్చిందంటున్నారు. ఇటీవ‌ల హ‌స్తిన‌లో విజ‌య‌సాయికి పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేదు. ఢిల్లీలో విజయసాయితో సీఎం జ‌గ‌న్‌.. ఎక్క‌డా ముఖాముఖి మాట్లాడిన సంద‌ర్భం ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదంటున్నారు. మంత్రి సింధియాతో మీటింగ్‌లోనూ సాయిరెడ్డిని బ‌య‌ట‌కు పంపించేశారు జ‌గ‌న్‌. ఆ రాత్రి డిన్న‌ర్ టైమ్‌లోనూ జ‌గ‌న్‌తో విజ‌య‌సాయి లేరు. ఇవి చాల‌వా.. ఆయ‌న ప్రాధాన్య‌త‌ను ఈయ‌న పూర్తిగా త‌గ్గించేశార‌ని చెప్ప‌డానికి.  
విజ‌య‌సాయిరెడ్డి స్థానాన్ని.. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డిలు భ‌ర్తీ చేశారు. వారిద్ద‌రినీ అన్నిటికీ ముందుంచారు జ‌గ‌న్‌రెడ్డి. ఈ ప‌రిణామంతో ఇక విజ‌య‌సాయిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టేన‌ని అంటున్నారు. 

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను క‌ల‌వ‌కుండానే తాను ఏపీకి తిరిగి రావ‌డాన్ని జ‌గ‌న్ అవ‌మానంగా ఫీల్ అవుతున్నారు. అమిత్ షా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయ‌డంలో విజ‌య‌సాయి ఫెయిల్ అయ్యార‌ని ఆగ్ర‌హంతో ఉన్నారు. అంత‌కుముందే కొంత‌కాలంగా సాయిరెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కావాల‌నే విశాఖ‌కు ప‌రిమితం చేశారు. తాడేప‌ల్లిలో అడుగు కూడా పెట్ట‌నీయ‌డం లేదు. ఇక ఢిల్లీలోనూ విజ‌య‌సాయి హ‌వాకు చెక్ పెడుతూ.. ప్ర‌భుత్వ ప‌నుల కోసం ప్ర‌త్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్‌ను పెట్టుకున్నారు. ప‌ర్స‌న‌ల్ ప‌నుల‌ను ఎంపీలు వేమిరెడ్డి, రామిరెడ్డిల‌కు అప్ప‌గిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలో, ఏపీలో, పార్టీలో విజ‌య‌సాయిరెడ్డి ఓ ఉత్స‌వ విగ్ర‌హం మాత్ర‌మే. 

ఉత్త‌రాంధ్ర‌లో విజ‌య‌సాయి ఓవ‌రాక్ష‌న్‌పై అనేక ఫిర్యాదులు రావ‌డంతో ఇటీవ‌ల ఆయ‌న ఫీజులు పీకేశార‌ని తెలుస్తోంది. ఇక తాడేప‌ల్లి వ్య‌వ‌హారాల‌న్నీ స‌జ్జ‌ల చూస్తున్నారు. పేరుకు పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ప‌ద‌వి మాత్రం ఉన్నా.. ప‌వ‌ర్ మాత్రం క‌ట్ చేసేశారు. బీజేపీతో బాగా అంట‌కాగ‌డం.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఢిల్లీ స్థాయిలో సొంతంగా రాజ‌కీయం చేస్తుండ‌ట‌మే.. విజ‌య‌సాయిపై జ‌గ‌న్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. క‌న్న‌త‌ల్లి, తోడ‌బుట్టిన చెల్లినే ప‌క్క‌న పెట్టిన జ‌గ‌న్‌కు.. సూటుకేసు కంపెనీలు, సీబీఐ-ఈడీ కేసులు, జైలులో తోడున్నంత మాత్రాన.. నెత్తిన పెట్టుకుంటార‌ని అనుకోవ‌డం విజ‌య‌సాయిరెడ్డి అమాయ‌క‌త్వ‌మే అవుతుందని అంటున్నారు. జ‌గ‌న్ జ‌గ‌నే.. విజ‌య‌సాయి విజ‌య‌సాయే...
 

google-ad-img
    Related Sigment News
    • Loading...