అన్నీ వినాలి జగన్.. నచ్చలేదంటే ఎలా?
Published on: Fri Jun 10, 2022 3:30PM
పాలన అద్బుతంగా వుంటే ఎవరికీ విమర్శించే అవకాశం వుండదు. ఫరవాలేదనిపిస్తే సూచనలు, సలహా లు యిస్తారు. బొత్తిగా అస్తవ్యస్తంగా వున్నపుడు గట్టి సూచనలు, కాస్తంత అసంతృప్తితో కూడిన వివరణలూ వుంటాయి. తన పాలన ఎలా వుంది, ప్రజలు ఏమనుకుంటున్నారని రాజుగారు మంత్రులతో, సామంతు లతో సమావేశం పెట్టినపుడు అనుకూలం, అననుకూల వ్యాఖ్యలు, వివరణలూ కూడా వినవలసి వస్తుం ది. అం దరూ శభాష్ అనరు. వారు తెలుసుకున్నవిశేషాలను అనసరించి సమా చారం అంది స్తారు. అది రాజు గారికి నచ్చవచ్చు, నచ్చకాపోవచ్చు. అన్నంత మాత్రాన వాస్తవం మారి పోదు గదా?!
కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ రెడ్డి మాత్రం ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు, కీలక నేత లతో వర్క్ షాప్ నిర్వహించేరు. అంతా మంచి వార్తలు చెబుతారని, విని నవ్వుకుంటూ వెళిపోవచ్చని, తనకు అం దరూ భజనచేస్తారని జగన్ ఆశిం చేరు. కానీ అందుకు కాస్తంత విరుద్ధ వాతావరణమే అక్కడ ఏర్పడింది. వర్క్‌షాప్ లో పాల్గొన్నవారిలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరావు అమ్మ ఒడి పథకం అమలు విషయం లో చాలా అసంతృప్తినే వ్యక్తం చేసేరు. ప్రకాశం జిల్లా లబ్దిదారుల్లో అంతకుముందు వున్నవారిని కూడా తొలగిం చడమేమి టని ఆశ్చర్యంతో కూడిన ప్రశ్నేసంధించారు. వారంతా అనర్హులుగా గుర్తించడం వల్లనే తొలగించాల్సి వచ్చిందని జగన్ సమాధానం. అయితే అంతకుముందు పొరపాట్లు జరిగినందు వల్ల ఈసారి సవరించే క్రమంలో వారిని తొలగించామన్నారు. కానీ ఆ సమాధానం మాజీ మంత్రిని అంతగా సంతృప్తి పరచలేదు. తొలి రెండువిడతల్లో వారికి డబ్బులు వేయడం పొరపాటున జరిగిందట!
ఇక కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి పట్ల జగన్ ఆగ్రహానికి కారణమేమంటే గ్రామాల్లో విద్యుత్ సమ స్యతో పాటు ఇసుక సమస్య గురించి కూడా వర్క్‌షాప్‌లో చర్చకు తేవడం. గ్రామాల్లో కార్యకర్తలు చేసిన పనులకు బిల్లుల విషయం తేలకపోవడం ఇబ్బందికరంగా మారిందన్నారు. అలాగే విద్యుత్ సమస్య తీవ్రంగా వుందని అనడం జగన్ చాలా ఇబ్బంది పెట్టింది. ఏవోనాలుగు మంచి మాటలు చెబుతారని, ఆనందాన్నిచ్చే సమాచారం ఇస్తారని అనుకుంటే, ఇలాంటి అంశాలు సీఎంకు చిరాకు కలిగించాయి. అందుకే కందుకూరు ఎమ్మెల్యే పైనా కాస్తంత విసుక్కున్నారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు. తమకు కావలసిన పనులు జరగాలనుకుంటారు. తమకు అన్ని పథకా లు సవ్యంగా అమలుజరగాలనే ఆశిస్తారు. తప్ప రాజకీయంగా అధికారంలో వున్నవారికి లబ్ధి చేరడానికి వారు ఓట్లు వేయలేదు. ప్రజలు ప్రేమిస్తారు, ఓట్లు వేస్తారు, చిరాకేస్తే రాళ్లూ వేస్తారు, ఘాటుగా విమర్శలూ చేస్తారన్నది జగనన్నకి ఇంకా తెలియక కాదు. అలాంటివి అస్సలు ఇష్టపడడు. ఆయనకు అదేదో సిని మాలో వలె రోజూ వీలయితే ప్రతీ క్షణం భజనచేసే వారంటే మహా యిష్టం. అదే కోరుకుంటున్నారు ఆంధ్రా సీఎం. మరి అలాంటపుడు వర్క్‌షాప్‌లు నిర్వహించి మీరీ చెవికి ఇంపుగా లేని అంశాలను విన డం దేనికి, ఎలాగూ స్పందించరు. పాలనా వ్యవహారాలలో మార్పులు చేర్పులు వుండవు, తాను అను కున్న విధంగానే చేస్తారు, చేయమని హెచ్చరిస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులూ వారి చిర్నవ్వు చూస్తూ పదవీ కాలం ముగించేయాలంతే!


