TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విజయసాయిరెడ్డి జగన్ ను టార్గెట్ చేస్తున్నాడా...!

Published on: Tue Apr 3, 2018 3:05PM

 

ఉరుము ఉరిమి మంగలం మీద పడింది అన్న సామెత లాగ... పాపం విజయసాయిరెడ్డి చేసిన పని వల్ల ఇప్పుడు జగన్ కు మరిన్ని సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారని... విజయ్ మాల్యాను చంద్రబాబు నాయుడు కలిశారా? లేదా? అని ప్రశ్నిస్తున్నానని..  దీనిపై బాబు ప్రజలకు సమాధానం చెప్పాలని మీడియా ముందు రెచ్చిపోయాడు. అంతేకాదు విజయ్ మాల్యా నుంచి రాజకీయ విరాళాల రూపంలో రూ.150కోట్లు సేకరించారా? లేదా?’ అంటూ చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు విజయ సాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డికి ఇలా మాట్లాడటం అలవాటేలే అని కామెడీగా తీసుకున్నా ఇప్పుడు ఈ విషయం సీరియస్ అవుతోంది. చంద్రబాబుపై విజసాయిరెడ్డి చేసిన కామెంట్లపై రగిలిపోతున్న టీడీపీ నేతలు..  అసలు విజయ్ మాల్యాతో వైసీపీ నేతలు ఎవరెవరికి సంబంధాలున్నాయో అన్న విషయాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు.

 

ఈ నేపథ్యంలోనే సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అది కూడా జగన్ గురించే. లండన్ లో చదువుకుంటున్న జగన్ కూతురు ప్రస్తుత నివాసం.. విజయ్ మాల్యా ఇంట్లోనేనట..!విజయ్ మాల్యాతో వైఎస్ జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న సంగతి తెలిసిందే కదా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు… టీడీపీ ఎంపీగా ఉన్న డీకే ఆదికేశవులునాయుడును.. తన వైపుకు తిప్పుకున్నారు. లిక్కర్ ఫ్యాక్టరీలు ఉన్న ఆదికేశవులు నాయుడు… విజయ్ మాల్యా వ్యాపార భాగస్వామి. ఆ సమయంలో విజయ్ మాల్యాకు..వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. అప్పటినుండి ఆ పరిచయం అలా కొనసాగిందట. అంతేకాదు అప్పట్లో కాంగ్రెస్ కు ..గత ఎన్నికలకు ముందు వైసీపీ కూడా.. విరాళాలు..యూబీ గ్రూప్ నుంచి అందాయట. ఇక ఈ పరిచయాలతోనే చదువు కోసం లండన్ కు వెళ్లిన తన కూతురిని విజయ్ మాల్యా నివాసంలోనే ఉంచారట. తన కుమార్తె బాగోగులు చూసుకునేందుకు… అక్కడే ఉంటున్న విజయ్ మాల్యా సహకారం కోరగా.. లండన్ లో తనకు ఉన్న ఓ ఇంటిని జగన్ కూతురి కోసం విజయ్ మాల్యా కేటాయించినట్టు చెబుతున్నారు.

 

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...ఈ విషయాలన్నీ విజయసాయిరెడ్డికి తెలుసు.. అయినా కూడా మాల్యా పేరు బాబుతో లింక్ చేసి... ఆ రచ్చలో జగన్ కు ఉన్న సంబంధాలను టీడీపీ ద్వారా ఇన్ డైరెక్ట్ గా బయటకు తీసుకురావాడనికే ఇలా చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క వైఎస్ జగన్ కూడా… విజయసాయిరెడ్డి తీరుపై అసహనానికి గురవుతున్నారట. తెర వెనుక ఏదో జరుగుతోందన్న ఆందోళనకు జగన్ గురువుతున్నారట. మరి నిజంగానే విజయసాయిరెడ్డి జగన్ ను ఇరికించేందుకే ఈ ప్లానే వేశారా...? విజయసాయిరెడ్డి అసలు టార్గెట్ చంద్రబాబా..? లేక వైసీపీ అధినేత జగనా..? అని వైసీపీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు..ఏది ఏమైనా విజయసాయిరెడ్డి జగన్ కిందకే నీళ్లు తెచ్చేలా ఉన్నారని సామాన్యులు గుసగుసలాడుకుంటున్నారు..