మీ ఛానెళ్లను రావొద్దన్నా... ఎందుకొచ్చారు...

 

సాధారణంగా రాజకీయాలకు, మీడియాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. నిజానికి ఒక్కో పార్టీకి ఒక్కో ఛానెల్ ఉంటుంది...వీటి పని పక్క పార్టీలను తిట్టడం... తమ పార్టీలకు ఫేవర్ గా ఉండటం.. భజన చేయడమే. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటారా..? వైసీపీ అధినేత జగన్ వల్ల చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ జగన్ ఏం చేశాడనుకుంటున్నారా..?

 

జగన్ ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సంతరావూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక మీడియా సమావేశం కాబట్టి అందరూ ఛానెల్స్ వాళ్లు వస్తారు. అలాగే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రతినిధులు కూడా వెళ్లారు. ఇక మీడియా సమావేశానికి వచ్చిన జగన్ అక్కడ వారి పేర్లను అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే.. ఆంధ్రజ్యోతి నుంచి ప్రసాద్, ఏబీఎన్ చానల్ నుంచి సురేష్ ఈ సమావేశానికి వచ్చారు. ఇక వారిని అన్నా అని సంబోధించిన జగన్... తన మీడియా సమావేశాలకు రావద్దని ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థలకు ఎప్పుడో చెప్పాను.. కానీ మీ ఇద్దరూ రావడం కరెక్ట్ కాదు. అయినప్పటికీ, లెట్స్ గో దిస్ మూమెంట్..  సాక్ష్యాధారాలు లేకుండా అన్యాయంగా, ఇన్టెన్షనల్ గా మీరు రాతలు రాశారు... దానిపై కోర్టులో కేసు జరుగుతూనే ఉంది ఇంకా... కాబట్టి ఆంధ్రజ్యోతి అనే పేపర్ ను, ఏబీఎన్ అనే చానల్ ను వైఎస్ఆర్ సీపీ ఎప్పుడో బాయ్ కాట్ చేసింది. వారి పేపర్ లో రాసే రాతలు, టీవీలో చూపే వార్తలను నమ్మవద్దని ఎన్నోసార్లు చెప్పాను. సో మీరు ఇక్కడికి రావడం కరెక్ట్ కాజు... ఎలాగూ వచ్చారు కాబట్టి కేక్ తిని పొండి" అని అన్నారు. మొత్తానికి జగన్ కు ఆ ఛానెళ్ల మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మరోసారి బయట పడింది.