ఈ టైంలో ఆ వాగుడు అవసరమా...!


దేవుడా.. ఎన్ని ప్రసంగాలు చేసినా... ఎంత రాజకీయానుభవం ఉన్న వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఇప్పటివరకూ తెలుసుకోకపోవడం మూర్ఖత్వం. నిజంగా అది మూర్ఖత్వం అనుకోవాలో..? లేక అమాయకత్వ అనుకోవాలో తెలియని పరిస్థితి. చంద్రబాబును ఇరుకున పెట్టాలని చెప్పి తనే ముందు వెనుకా ఆలోచించకుండా మాట్లాడుతూ పప్పులో కాలేస్తుంటాడు. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి బుక్కయ్యాడు. అసలు సంగతేంటంటే.. ప్రస్తుతం జగన్ ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్సలు గుప్పించే క్రమంలో రాజధాని టాపిక్ ఎత్తుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని ఏర్పాటుకు అన్ని విధాలా అవకాశం ఉన్న జిల్లాలోని దొనకొండ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేసిందని ..దొనకొండ ప్రాంతంలో 50వేల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. అందువలన అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కేంద్ర కమిటీ సిఫార్సు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు దానికి ఒప్పుకోలేదు అని విమర్శించారు.

మరి ఇక్కడి వరకూ బాగానే ఉంది. చంద్రబాబును ఏదో ఒక రకంగా ఇరికించేశాం అనుకున్నాడు. కానీ ఇక్కడే ఉంది ట్విస్ట్. ఈరకంగా అమరావతి మీద ఉన్న వ్యతిరేకతను జగన్ మరోసారి బయటపెట్టారు అని అనుకుంటున్నారు కొంతమంది. ఎందుకంటే.. గతంలో రాజధానిని అమరావతిలో నిర్మించడాన్ని జగన్ వ్యతిరేకించారు. మరి జగన్ ఇప్పుడు అక్కడ పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి అక్కడ ఆ పాట పాడాడు. అదే సమయంలో మరో విషయం మరిచిపోయినట్టున్నారు. అమరావతిని వ్యతిరేకిస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్టే. అసలే అక్కడ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా.  ఇలాంటి టైములో ఇలాంటి వాగుడు మొదటికే మోసం చేస్తుందని జిల్లా నాయకులు భావిస్తున్నారట. కానీ ఏం చేస్తారూ.. ఎలాగూ జగన్ చెప్పినా వినడని తమలో తామే చర్చించుకొని సైలెంట్ అయిపోయారట. ఏది ఏమైనా చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ... ప్రజల్లో ఇంకా వ్యతిరేకతను మూటగట్టుకోవడం తప్పితే తాను చేసే వ్యాఖ్యవల్ల  జగన్ కు వచ్చే లాభం కంటే.. నష్టమే ఎక్కువగా కనపిస్తోంది. మరి ఈ రెండు జిల్లాలకు వచ్చినప్పుడు ఏం పాట పాడతారో చూద్దాం...