హా హా.. జగన్ భలే బుక్కయ్యాడుగా..


పాపం జగన్ మోహన్ రెడ్డి.. ఏం చేద్దామనుకున్నా పాపం కాలం కలిసిరావట్లేదు. కనీసం చంద్రబాబుపై విమర్శలు గుప్పించి ప్రజల్లో బుక్ చేద్దామన్నా కూడా టైం సహకరించట్లేదు. అటుపోయి ఇటుపోయి చివరకి జగనే బుక్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడ మరోసారి బుక్కయ్యాడు. ప్రజా సంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక పాదయాత్రలో ఎలాగూ టార్గెట్ చంద్రబాబే కాబట్టి.. రోజూలాగే ఆయనపై విమర్శలు గుప్పించడం స్టార్ట్ చేశాడు. ప్రియతమ నేత, మహా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్ లను ప్రవేశపెడితే చంద్రబాబు దానిని పూర్తిగా నీరుగార్చారని.... ఎక్కడా కూడా ఎవరు ఎలాంటి ప్రమాదంలో 108 కి ఫోన్ చేసినా సరిగా స్పందించే దిక్కు లేదని చాలా ఆవేశంగా మాట్లాడుతుండగా...అటువైపుగా 108 వాహనం సైరన్ తో వెళుతుంది. అంతే ఒక్కసారిగా అది చూసిన జగన్ షాకై ప్రసంగం ఆపేశాడు. ఆ సభకు సమీపంలో రోడ్డు ప్రమాదం జరగడంతో క్షణాల్లో అక్కడికి చేరుకున్న అంబులెన్స్  వారిని తీసుకొని ఆస్పత్రికి బయల్దేరింది. ఇక రోడ్డుపై జగన్ సభ జరుగుతుండటంతో.. అంబులెన్స్ ను వేరే మార్గంలో దారి మళ్లించారు. ఇక ఈ చోద్యం అంతా  అక్కడ ఉన్న జనం చూస్తూనే ఉన్నారు. జగన్ కూడా జరిగిందంతా చూసి ఆఖరికి ఏం మాట్లాడాలో తెలియక.. మళ్లీ 108 మాట ఎత్తకుండా వెంటనే టాపిక్ మార్చేశాడు. మొత్తానికి జగన్ చంద్రబాబు ఇరికించాలను కుంటే.. దరిద్రం ఏంటో.. జగనే అందరి ముందు ఇరుక్కునే పరిస్థితులు వస్తాయి. తన గాలి తానే తీసుకుంటాడు..