జగన్ మోనార్క్ ప్లాన్ బయటపడింది...

 

తాడిని తన్నేవాడు ఉంటే.. వాడి తలను తన్నేవాడు ఉండాటు అన్నసామెత గుర్తుంది కదా. జగన్ ను చూస్తుంటే అదే గుర్తొస్తుంది ఇప్పుడు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కే అన్ని తెలివితేటలు ఉంటే.. రాజకీయాల్లో తలలు పండిన పెద్ద మనుషులు ఎంతో మంది ఉన్నారు. వాళ్లకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. జగన్ రాజకీయ ఎత్తులు ఆ మాత్రం అర్ధంచేసుకోలేరా...

 

అసలు సంగతేంటంటే.. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో జరిగిన అన్యాయం నేపథ్యంలో అందరూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు నిరసనలు.. ఇక్కడ బంద్ లు చేసి నిరసన వ్యక్తం చేస్తే.. ఇప్పుడు తాపీగా జగన్ గారు ప్రత్యేక హోదా కోసం పోరాడ‌తామ‌ని లేదంటే... ఏప్రిల్‌ 6న త‌మ పార్టీ లోక్ స‌భ స‌భ్యులు రాజీనామా చేస్తార‌ని ఓ ప్రకటన చేశారు. ప్రకటన చేసేశాం...ఒక పని అయిపోయింది.. ఇప్పుడు ఎవరూ మనల్ని ఏం అనరు అని అనుకున్నట్టు ఉన్నాడు. కానీ జగన్ ప్లాన్ ఏంటో సామాన్యులకు సైతం అర్ధమైపోయింది. ఏప్రిల్ లో కనుక రాజీనామా చేస్తే.. వాటి ఆమోదానికి రెండు మూడు నెలల టైం పడుతుంది... ఈ లోపు 2019 ఎన్నికలకు సమయం కూడా దగ్గరపడుతుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఉపఎన్నికలు నిర్వహించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే జగన్ చాలా తెలివిగా.. కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు మూహుర్తం ఏప్రిల్ లో పెట్టారని అంటున్నారు.

 

అంతేకాదు... ఇంకో రీజన్ కూడా చెబుతున్నారు. త్వరలో త్రిపుర, కర్ణటాక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే బీజేపీకి ఆ ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని దానిని ఏప్రిల్ వరకు పొడిగించినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి బీజేపీకి ఇబ్బంది అయితే వైసీపీకి వచ్చిన నష్టం ఏంటంటా అని అనుకుంటున్నారా..? ఎందుకు లేదు... బీజేపీతో చేతులు కలపాలని వైసీపీ ఎప్పటినుండో తహతహలాడుతుంది కదా. అందుకే.. బీజేపీకి ఇబ్బందైతే తనకు కూడా ఇబ్బందని జగన్ గ్రహించినట్టు ఉన్నాడని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కు మాత్రం ఎన్నికలంటే భయపట్టుకుందన్నది దీనిబట్టి అర్ధమైపోతుంది. ప్రస్తుతం ఏపీలో తమ పార్టీ పరిస్థితి ఏంటో జగన్ కు కూడా అర్దమైపోయినట్టుంది. అందుకే ఇలాంటి సాకులు వెతుకున్నాడు. రాజీనామాలు చేస్తే అప్పటివరకూ ఆగడమెందుకు.. ఇప్పుడే రాజీనామాలు చేయోచ్చు కదా అని జగన్ కు రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే.. బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదన్న విషయం. బీజేపీతో కంటే ఇంక పవన్ తో చేతులు కలిపినా కాస్త ఉపయోగమైనా ఉంటది. పాపం జగన్ మాత్రం ఏం చేస్తాడు.. పవన్ తో చేతులు కలిపితే కేసులు నుండి బయటపడేయలేడు కదా. మొత్తానికి జగన్ తన మోనార్క్ తెలివి తేటలు ప్రదర్శించి బుక్ అయ్యాడు..