TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాధా మంటలో ఆజ్యం పోస్తున్న జగన్....

Published on: Tue Jan 30, 2018 11:54AM

 

అగ్నికి ఆజ్యం పోసినట్టు అన్న సామెత తెలుసుకదా...ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇంతకీ ఎవరి మంటలో జగన్ ఆజ్యం పోస్తున్నాడనుకుంటున్నారా...? ఎవరో కాదు విజయవాడ వైసీపీ నేత వంగవీటి రాధా విషయంలో. అసలు సంగతేంటంటే...గతంలో వంగవీటి రాధాకి, అదే పార్టీకి చెందిన గౌతంరెడ్డికి మధ్య వార్ జరిగిన సంగతి గుర్తుంది కదా. వంగవీటి కుటుంబసభ్యులపై గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలకు గాను.. వంగవీటి రాధా అభ్యంతరం వ్యక్తం చేయగా ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది అప్పట్లో. దీనికి గాను జగన్... గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ ప్రకటించింది.

 

అయితే ఆతరువాత కొద్ది రోజులకే గౌతంరెడ్డి పార్టీ నేతలతో కలవడం.. భేటీ అవ్వడంతో రాధా మళ్లీ ఆగ్రహానికి గురయ్యారు. అప్పటినుండి జగన్ పై పార్టీపై రాధా అసంతృప్తితోనే ఉన్నారు. దానికితోడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో రాధా పుల్ ఫైర్ మీద ఉన్నారు. దాంతో రాధా వైసీపీ పార్టీని వీడి టీడీపీ పార్టీలో మారబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక జగన్ ఆయన్ను బుజ్జగిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.

 

ఇవన్నీ ఇలా జరుగుతుంటే... ఇప్పుడు జగన్ పాదయాత్రలో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఈఫొటో ఇప్పుడు పెద్ద చర్చలకు దారితీసింది. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందనుకుంటున్నారా...? ఆ ఫొటోలో జగన్ తో పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసిన గౌతంరెడ్డి కూడా ఉన్నాడు. గౌతంరెడ్డి ప్రజా సంకల్పయాత్రలోనే జగన్ ను కలవడంతో ప్రస్తుంతం సంచలనంగా మారింది. దీంతో గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడినట్టు ఇప్పుడు నిజం బయటపడింది అంటున్నారు. కేవలం అప్పట్లో రాధాను బుజ్జగించటానికే అప్పట్లో డ్రామా ఆడారు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది...అంతేకాదు...రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు. మరి ఇప్పుడు దీనిపై రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జగన్ చేసిన ఈ పనికి రాధా ఇక పార్టీ మారడం ఖాయమేనేమో అనిపిస్తుంది.. చూద్దాం ఏం జరుగుతుందో...