అమ్మ జగన్ ఇంత కుట్రా.. నిధులు ఆపమని బావ చేత లేఖ...

 

చేయాల్సింది అంతా చేసేసి మళ్లీ పైకి ఏం తెలియనట్టు మాటలు మాత్రం కోటలు దాటిస్తున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు సందు దొరుకుతుందా.. ఎప్పుడు చంద్రబాబుపై, ప్రభుత్వంపై విమర్సలు చేద్దామా అని చూసే జగన్ నాటకం బయటపడింది. ఏపీకి ప్రత్యేకహోదా చంద్రబాబువల్లే రావడం లేదని.. రాజధాని అమరావతి నిర్మాణమంటూ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ... వచ్చిన నిధులు ప్రభుత్వం దోచుకుంటుంది.. భూ ఆక్రమణలకు పాల్పడుతుందంటూ.. అబ్బో ఒకటా.. రెండా ఎన్నో డైలాగులు కొట్టారు. అంతేనా... ఇటీవల పార్లమెంట్లో కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక దీనికిగాను.. రాజధాని నిర్మాణానికి నిధులు కావాలని ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును కోరిందని...రుణం ఇచ్చే అంశాన్ని ప్రపంచ బ్యాంకు పరిశీ లిస్తోందని.. సంప్రదింపులు పూర్తి అయిన వెంటనే రుణం మంజూరవుతుందని తెలిపారు.

 

అయితే ఇప్పుడు జగన్ గారి బండారం బయటపడింది. అదేంటంటే... అమరావతి నిర్మాణానికి నిధులు ఇవ్వద్దంటూ కెనడాకు చెందిన ఓ ఎన్జీవో సంస్థ, ప్రపంచ బ్యాంకుకు లేఖ రాసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉన్నట్టు బయటపడింది. ఎక్కడ అమరావతి.. ఎక్కడ కెనడా... అమరావతి నిర్మాణం ఆపటానికి కెనడాలో ఉన్న సంస్థకి సంబంధం ఏంటి.. అన్న సందేహాలు వస్తున్నాయి కదా..? అక్కడే ఉంది అసలు ట్విస్ట్... కెనడా ఎన్జీవో సంస్థ వెనుక ఉంది కధ అంతా నడిపించింది, జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ అని తెలిసింది. ఈ విషయాన్ని మంత్రి నక్కా ఆనందబాబు బయట పెట్టారు. రాష్ట్ర అభివృద్ధి ని సైందవుడిలా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అని అన్నారు. రైతుల స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 34 వేల ఎకరాలు ఇస్తే, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో ప్రపంచ రాజధాని నిర్మాణం చేపట్టడం జరిగితే, అమరావతి రాజధాని లో నిర్మాణం ఇష్టంలేని జగన్మోహన్ రెడ్డి ఇన్ని కుట్రలు పన్నుతున్నారని అన్నారు. జగన్ బావ బ్రదర్ అనిల్, తనకు ఉన్న మతపరమైన పరిచయాలతో, అక్కడ నుంచి ప్రపంచ బ్యాంకు కు ఫిర్యాదు చేసినట్టు, ప్రభుత్వంలోని పెద్దలు అంచనాకి వచ్చారు.. అంతేకాదు.. పూర్తి వివరాలు సేకరించి, ప్రజల ముందు ఉంచటానికి రెడీ అయ్యారు.

 

ఒక పక్క అమరావతి అభివృద్దికి చంద్రబాబు నానా తంటాలు పడుతుంటే...జగన్ గారేమో తెరవెనుక నుండి ఇలాంటి పనులు చేస్తున్నారని...మళ్లీ ఏపీలో ఎలాంటి అభివృద్ది లేదంటూ పైకేమో చిలక పలుకులు పలుకుతున్నారు. మరి ఇప్పుడేమో ఈ విషయం బయటపడింది. దీనిపై ఎలాగ స్పందిస్తాడో చూద్దాం..