జగన్ దీనికి సమాధానం చెప్పు..

 

ఎప్పుడూ అధికార పార్టీ పైన విమర్శలు గుప్పించడం... ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా చంద్రబాబును కాల్చి చంపండి.. ఉరితీయండి అంటూ వైసీపీ అధినేత జగన్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాడు. అంతేకాదు.. ఎప్పుడూ చంద్రబాబు అది చేయలేదు.. ఇది చేయలేదు.. దానికి సమాధానం చెప్పాలి... దీనికి సమాధానం చెప్పాలి అంటూ విమర్శించమే పని. కానీ జగన్ మాత్రం సమాధానం చెప్పాల్సిన వాటికి మాత్రం చెప్పకుండా..కాలం వెల్లదీస్తున్నాడు.

 

అక్రమాస్తుల కేసులో భాగంగా ఈడీ ఇప్పటికే చాలాసార్లు జగన్ ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. గతంలోనూ వందల కోట్ల జగన్ ఆస్తులు అటాచ్ చేసింది. అయితే గత కొద్దరోజులుగా ఏలాంటి వార్తలు లేవు కానీ..మరోసారి జగన్ ఆస్తులు అటాచ్ మెంట్ చేసింది ఈడీ. ఆస్తులు జప్తు చేస్తున్నట్టు పత్రికా ప్రకటన జారీ చేసింది. దీంతో ఈడీ ఇచ్చిన షాక్ కు జగన్ క్యాంపులో ఆందోళన మొదలైంది. మొన్నటివరకూ.. నెమ్మదించిన జగన్ కేసులు, ఇప్పుడు మరో సారి స్పీడ్ పెంచుకోవడంతో  ఏమి జరుగుతుందో అనే టెన్షలో ఉన్నారు జగన్ అండ్ కో బ్యాచ్.

 

మరి అన్ని విషయాలపై రియాక్ట్ అయ్యే జగన్ తన విషయాల గురించి ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదని అంటున్నారు. తన ఆస్తులు ఈడీ ఎందుకు జప్తు చేస్తుందో.. దానిపై ఎందుకు జగన్ సమాధానం చెప్పడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే  తెలుగుదేశం నేత వర్ల రామయ్య జగన్ తీరుపై మండిపడ్డారు. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం ఇదేం ఫస్ట్ టైమ్ కాదు.. ఇప్పటికి చాలాసార్లు అటాచ్ చేసింది.. అయినా జగన్ దీనిపై ఎందుకు స్పందించడంలేదు.. తన ఆస్తులు ఈడీ ఎందుకు జప్తు చేస్తుందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ కు ఉంది కదా... అలా కాకుండా... జగన్.. పార్టీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా కూర్చున్నారని అన్నారు. ఈడీ వంటి అథారిటీ ఆస్తులు సీజ్ చేసిందంటే..జగన్ వి అక్రమ ఆస్తులని ఆయన ఒప్పుకున్నట్టే అని అన్నారు. భారతదేశంలో నైతిక విలువలకు తిలొదకాలిచ్చిన రాజకీయ నాయకుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అని వర్ల రామయ్య విమర్శించారు. అంతేకాదు.. ఆస్తుల జప్తుపై వైసీపీ వివరణ ఇవ్వగలదా.. ఇవి అక్రమ ఆస్తులు కాదు కష్టార్జితమని చెప్పగలరా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. మరి దీనిపై జగన్ సమాధానం చెబుతాడా...? జగన్ సమాధానం చెబుతాడు అని అనుకోవడం మన అమాయకత్వం అని అనుకోవచ్చు.. ప్రజాస్వామ్యంలో నాయకుడిగా ఉన్నప్పుడు ఏదైనా ఆరోపణలొచ్చినప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాజకీయ నాయకులకు ఉంటుందన్న విషయాన్ని జగన్ అప్పుడు కావాలనే మరిచిపోతుంటారు.