TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దేవుడా.. జగన్ కు ఇంత అవమానమా..?

Published on: Sat Nov 18, 2017 3:51PM

 

పాపం జగన్ పరిస్థితి ఏలా ఉందంటే.. కామెడీగా సెటైర్లు వేసుకోవడానికి అన్నట్టు తయారైంది. ఇప్పటికే పాదయాత్ర అంటూ.. శుక్రవారం కోర్టు కు అంటూ తిరుగుతున్న జగన్ పై నెటిజన్లు కామెడీ చేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ దొరుకుతుంది. సోషల్ మీడియా సాక్షిగా జగన్ ను ఆడేసుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో భాగంగా జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. పాపం పాదయాత్ర చేసుకోవాలి.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండని బతిమాలుకున్నా కోర్టు మాత్రం ససేమిరా ఒప్పుకోలేదు. ఎట్టి పరిస్థితిలోనూ కోర్టుకు రావాల్సిందే అని మొట్టికాయలు వేసింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు నిన్న శుక్రవారం కావడంతో జగన్ కోర్టుకు వెళ్లాడు. ఇంకేముంది ఇప్పుడు జగన్ ను ఆడేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు, పవన్ కళ్యాణే. అదేంటీ అనుకుంటున్నారా..? అక్కడే ఉంది మరి అసలు ట్విస్ట్.

 

అసలు సంగతేంటంటే.. నిన్న అక్రమాస్తుల కేసులో భాగంగా... జగన్ కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే నిన్ననే.. పవన్ కళ్యాణ్ కు లండన్ లో అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకుగాను ఇండో-యూరోపియన్ ఎక్సలెన్స్ అవార్డును ఆయనకు ప్రదానం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే.. నిన్న చంద్రబాబు బిల్ గెట్స్ తో కలిశారు. ఆయనతో కలిసి ఒక వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిల్ గేట్స్ చంద్రబాబు ను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో ముగ్గురు ఫొటోలు కలిపి ఓ ఫొటో తయారు చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఇంకేముంది... ఇప్పుడు ఈ ఫొటో తెగ వైరల్ అవుతుంది. మొత్తానికి జగన్ మాత్రం నెటిజన్లకు అడ్డంగా బుక్కయ్యాడు. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటో ఏంటో మీరు కూడా చూడండి...