అవినీతి పరులను జైల్లో పెడతావా... ఏం మాట్లాడున్నావ్ జగన్...?

 

పాపం పాదయాత్ర చేస్తూ.. అలసిపోయి ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నట్టున్నాడు జగన్.. అందుకే ఎం మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లేదు. జగన్ మాట్లాడటం ఏమో కానీ.. జగన్ మాటలు వింటున్న వాళ్లకి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోయినంత పనవుతుంది. ఇటీవల ఓ అవ్వ నాకు ఉండటానికి ఇల్లు లేదు... తినడానికి తిండి లేదు అని చెబితే.. దానికి జగన్ బాబు నన్ను సీఎం చేయండి.. అధికారంలోకి వస్తే అన్ని చేస్తా అని అవ్వతో పాటు అక్కడ ఉన్న వారందరికీ షాక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా.. అవినీతి పరులను జైల్లో పెడతా అని మాట్లాడుతున్నాడు. దీంతో జగన్ వ్యాఖ్యలకు జనానికి నవ్వాలో.. ఏడవాలో కూడా తెలియని స్థితిలో పడ్డారు. తనదగ్గర డబ్బులు లేవని.. చంద్రబాబులాగ కేసులు లేవని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందంటున్నారు. అక్రమాస్తుల కేసులో ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్న జగన్ ను ఊరికే టైం పాస్ కోసం అక్కడికి పంపలేదు కదా.. సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఏకంగా జగన్ పై 11 ఛార్జ్ షీట్లు దాఖలు చేశాయి. ఇతని 11 కేసుల్లో నిందితుల నుండి వందల కోట్ల రూపాయలు ఆస్తులు జప్తు చేశాయి. ప్రతిశుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిందే. పాదయాత్ర చేసుకుంటాను.. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వమని కోరినా.. కోర్టు కుదరదు పొమ్మని చెప్పింది. ఏలాగో అలా కేంద్రాన్ని మేనెజే చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. అందుకే రాష్ట్రం విడిపోయినా.. ప్రత్యేక హోదాపైనా.. జగన్ చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ విమర్శిస్తాడు తప్పా...కేంద్రాన్ని మాత్రం పల్లెత్తు మాట అనడు. అంటే జగన్ కు చుక్కలే కదా. అలాంటి జగన్.. అవినీతి పరుల గురించి మాట్లాడుంటే మంచి కామెడీగా అనిపిస్తుంది. వాళ్లను జైల్లో పెడతా అని చెప్పడం ఇంకా కామెడీగా అనిపిస్తుంది. మరి జగన్ మాట్లాడేముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బెటర్.