చంద్రబాబు ముందా నీ కుప్పిగంతులు జగన్..?

 

రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికి రాజకీయ చాణుక్యుడు అని ఊరకనే పేరు రాలేదు కదా. ఆయనకు ఉన్న రాజకీయ తెలివితేటలు చూసి చాలా పెద్ద పెద్ద రాజకీయ నేతలే ముక్కున వేలు వేసుకుంటారు. అలాంటిది వైసీపీ అధినేత జగన్ ఎంత. హనుమంతడి ముందు కోతి కుప్పి గంతులు వేసినట్టు... చంద్రబాబు ముందు జగన్ కూడా అలానే కుప్పి గంతులు వేస్తుంటాడు.. బొక్క బోర్లా పడుతుంటాడు. అలా అని సైలెంట్ గా ఉంటాడా అంటే.. అదీ లేదు. ఏదో ఒక రకంగా చంద్రబాబును కెలుకుతాడు. ఏదో ఒకటి అనిపించుకుంటాడు. ఇప్పుడు తాజాగా మరోసారి అలానే ఇరుకున పడ్డాడు జగన్. పనామా పేపర్స్ మాదిరి.. ఇటీవల ప్యారడైజ్ పేపర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ పేపర్లో జగన్ పేరు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే. దీంతో టీడీపీకి జగన్ జుట్టు అందినట్టైంది. అందుకే.. చంద్రబాబు తన నాయకులకు చెప్పి ప్రెస్ మీట్ పెట్టించి మరీ జ‌గ‌న్‌ను క‌డిగించారు. ఇక చంద్రబాబు ఆదేశాలతో య‌న‌మ‌ల‌, కేఈ, సోమిరెడ్డి, వ‌ర్ల రామ‌య్య జగన్ పై విరుచుకుపడ్డారు.

 

మరి దీనికి జగన్ ఊరుకుంటాడా... తనకు విదేశాల్లో ఆస్తులు కానీ, వ్యాపారాలు కానీ, న‌గ‌దు కానీ ఉంద‌ని బాబు నిరూపించాల‌ని అన్నాడు. అంతేకాదు 15 రోజులు టైం కూడా ఇచ్చాడు. అలా నిరూపిస్తే.. త‌క్ష‌ణం తాను త‌న పార్టీ జెండీ పీకేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని అన్నారు. ఒక‌వేళ నిరూపించ‌క‌పోతే.. బాబు త‌న సీఎం సీటుకు రాజీనామా చేయాల‌ని స‌వాల్ విసిరారు. ఇంకేముంది జగన్ ఇచ్చిన సవాల్ కు చంద్రబాబు షాక్ అవుతారు... 15 రోజుల్లో నిరూపిస్తారా..? సవాల్ ను ఎదుర్కొంటారా..? అని అనుకున్నారు. మరి అక్కడ ఉంది చంద్రబాబు.. ఇలాంటి చిన్న విషయాలను కూడా చంద్రబాబు సీరియస్ తీసుకుంటే.. ఆయనకు జగన్ కు తేడా ఏముంటది. మరోసారి తన మార్క్ తెలివితేటలను నిరూపించుకున్నారు. జ‌గ‌న్ త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను త‌ప్పుకాద‌ని తానే నిరూపించుకోవాల‌ని సింపుల్ గా జగన్ కే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు, జ‌గ‌న్ ఊరావాడా త‌ప్పుల మీద త‌ప్పులు చేసి, జ‌నాల్ని దోచుకుని వాటిని న‌న్ను నిరూపించ‌మంటే ఎలా అని కామెంట్ చేశారు. అంతేకాదు, జ‌గ‌న్ ఈ దేశంలో దోచుకున్న సంప‌ద‌ను క‌క్కిస్తామ‌ని, ప్ర‌జ‌ల‌కు పంచుతామ‌ని అన్నారు. మొత్తానికి జగన్ చంద్రబాబు ఇలా కౌంటర్ ఇస్తాడని అనుకొని ఉండడేమో. ఇక చంద్రబాబు ఇచ్చిన కౌంటర్ కు జగన్ నుండి ఇంతవరకూ ఎలాంటి రెస్పాన్స్ లేదు. మొత్తానికి జగన్.. చంద్రబాబు ముందు తన ఆటలు సాగవని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది..