TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైద్రాబాద్ లో రాజసం... అమరావతిలో రాజకీయమా?

Published on: Tue Sep 27, 2016 3:11PM

హైద్రాబాద్ పదేళ్ల దాకా ఉమ్మడి రాజధాని. కాబట్టి హైద్రాబాద్ లో ఆంద్రా సీఎం వున్నా, మంత్రులున్నా తప్పేం కాదు. కాని, తప్పు కాదు కదా అని ఇక్కడే వుంటే నవ్యాంధ్రలో పాలన ఎట్లా సాగుతుంది? ఈ ఆలోచనతోనే చంద్రబాబు ఇంకా బోలెడు టైమున్న అప్పుడే పూర్తిగా విజయవాడకి మకాం మార్చారు. ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా సర్ది చెప్పి అమరావతికి చేర్పించారు. తాత్కాలిక సచివాలయం నుంచి పాలన నడుపుతున్నారు. సీఎం ఇంత చేస్తున్నా ప్రతిపక్ష నేతకి మాత్రం భాగ్యనగరంపై ప్రేమ తగ్గినట్టు లేదు!
ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత జగన్. అంటే ముఖ్యమంత్రి తరువాత అంతటి ప్రాముఖ్యత వున్న నాయకుడు. పైగా జనంలో వుండాల్సిన అవసరం వున్నావాడు. పాలన చేయాల్సింది అధికార పక్షం కాబట్టి అసెంబ్లీ, సెక్రటేరియల్, వివిధ ప్రభుత్వ శాఖల బిల్డింగ్ లు... వీటన్నటితో చంబ్రాబు అండ్ టీమ్ కి అవసరం వుంటుంది. కాని, ప్రతిపక్ష నేతకి ఏం అవసరం? జనం, జనం సమస్యలు వుంటే చాలు కదా? కాని, జగన్ మాత్రం ఎందుకో ఇంకా హైద్రాబాద్ నే పట్టుకుని వేలాడుతున్నాడు! తనని , తన ఎమ్మేల్యేల్ని, ఎంపీల్ని గెలిపించిన వాళ్లు ఆంధ్రాలో వుంటే మన సార్ వారు మాత్రం తెలంగాణ శాశ్వత రాజధాని వదిలి రావటం లేదు!
జగన్ హైద్రాబాద్ వదిలి పెట్టకుండా అమరావతికి చుట్టు చూపు కోసం వస్తే తప్పేంటి? ఈ ప్రశ్న కూడా సబబే! కాని, సీఎం పూర్తి స్థాయిలో అమరావతిలో వుంటూ జనం సాదకబాదకాలు చూస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడో పక్క రాష్ట్రంలో వుంటే ఎలా? ఈ కోణంలో జనం ఆలోచించే పరిస్థితి ఇప్పుడిప్పుడే వస్తోంది! పుష్కరాలు మొదలు భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల దాకా జనం సంతోషంలో వున్నా, ఇబ్బందుల్లో వున్నా జగన్ వాళ్ల సమక్షంలో వుండటం లేదు. వున్నట్టుండీ నిరాహార దీక్ష అనో, ఓదార్పు యాత్ర అనో వస్తాడు, హడావిడి చేస్తాడు, వెళ్లిపోతాడు! ఇదీ వరస... 
సమైక్యాంధ్ర వున్నప్పుడు హైద్రాబాద్ లో భారీగా ఆస్తులు కూడపెట్టినప్పటికీ, అక్కడే భారీగా వ్యాపారాలు వున్నప్పటికీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు మంచి సంబంధాలే వున్నప్పటికీ... వైసీపీ అధినేత ఆలోచించాల్సింది ఆంధ్రా ప్రజానీకం గురించి! వారికి అందుబాటులో వుంటేనే రేపు కాకపోతే మరునాడైనా అమరావతి పీఠం దక్కేది! లేదంటే హైద్రాబాద్ లో బిజినెస్ లు చేసుకోవాల్సిందే...