అవిశ్వాస తీర్మానం పెడతాం... పవనే చంద్రబాబుకు చెప్పాలి..
Published on: Sat Mar 3, 2018 2:43PM
.jpg)
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటికే అక్కడ ఆందోళనలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక మిత్రపక్షంగా ఉన్న టీడీపీ సైతం బీజేపీతో తెగదెంపులకు సిద్దపడింది. ఇక వైసీపీ నేత జగన్ కూడా ప్రత్యేక హోదాపై తమ వంతు పోరాటానికి దిగారు. అంతేకాదు.. ఎల్లుండి ఢిల్లీలో ధర్నా చేసిన తరువాత పార్లమెంటులో తమ పోరాటం ఉంటుందని జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం పోరాడడానికి వైసీపీ నేతలు ఢిల్లీకి బయలుదేరారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్.. జెండా ఊపి వారి పోరాటానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇంకా.. మార్చి 21న ఎన్టీఏ ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెడతామని.. చంద్రబాబు పార్టీలో ఉన్న ఎంపీలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేలా ఆయన పార్ట్‌నర్ పవన్ కల్యాణ్ చూడాలని అన్నారు.


