బయటపడిన జగన్‌, విజయసాయిరెడ్డిల బండారం...

 

ఒక పక్క పాదయాత్ర చేస్తూనే.. మరోపక్క ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసులోభాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ కేసులో జగన్‌తో పాటుగా వైసీపీ నేత విజయ్‌సాయిరెడ్డి విచారణ ఎదుర్కొంటున్నారు. ఇక ఈకేసులో మరోసారి జగన్ కు, విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. జగన్‌ సంస్థల్లో రాంకీ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీట్‌లో తన పేరును తొలగించాలని విజయసాయిరెడ్డి గతంలో పిటిషన్ దాఖలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీరామ్‌ జనవరి 20న కోర్టులో వాదనలు వినిపించారు. జనవరి 26 వతేది రిపబ్లిక్ డే సందర్భంగా కోర్టుకు సెలవుకు కావడంతో జగన్ కోర్టుకు రాలేదు. ఇక మొన్న జరిగిన విచారణలో.. సిబిఐ వాదనలు వినిపించింది... వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వ్యాపారులకు 'మేళ్లు' చేకూరిస్తే... వారి నుంచి జగన్ పెట్టుబడులు రాబట్టి లబ్ది పొందారని ప్రత్యేక కోర్టుకు సీబీఐ నివేదించింది. 'మేళ్లు' చేకూర్చే జీవోలు ఇచ్చిన తర్వాతే జగన్ కంపెనీల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారని... రాంకీ సంస్థ విషయంలోనూ ఇలాగే జరగడాన్ని గుర్తించాలని కోరింది... ఒక పథకం ప్రకారం పారిశ్రామికవేత్త లతో జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టించారని, ఈ కుట్రలో విజయసాయిరెడ్డికి పాత్ర ఉందని సీబీఐ నివేదించింది.