నిండు ప్రాణాలు బలిగొన్న వైసీపీ పాదయాత్ర...

 

జగన్ పాదయాత్ర ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ప్రజా సంకల్పం పేరుతో జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటివరకూ 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. ఈ క్రమంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున ర్యాలీలు జరిపారు. వాక్ విత్ జగన్ అంటూ, ఊరు ఊరునా తిరుగుతాం అంటూ పార్టీ నేతలు హడావుడి చేశారు. వీళ్ల హడావుడితో ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొన్నారు. వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లాలో కూడా మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత జోగి రమేష్ ఆధ్వర్యంలో కొండపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే రహదారిలో పాదయాత్ర నిర్వహించారు. అదే సమయంలో ఓ అంబులెన్స్ రాగా అది పాదయాత్రతో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. ఆ అంబులెన్స్ల్ లో రాములు అనే హార్ట్ పేషెంట్ ఉన్నాడు. అయితే పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం...పైగా అనుమతి లేని ర్యాలీ కావటంతో పోలీసులు కూడా పెద్దగా లేరు. ఒకే ఒక్క పోలీస్ వాహనం ఉంది. అంబులెన్స్‌ డ్రైవర్ వారికి చెప్పి... వారిని క్లియర్ చేసి అంబులెన్స్‌ కి దారి ఇవ్వటానికి 32 నిమషాలు పట్టింది... దీంతో హాస్పిటల్ కి తీసుకువెళ్ళే సరికి, రాములు చనిపోయారు అని డాక్టర్ లు చెప్పారు.ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అనుమతి లేకుండా పాదయాత్ర నిర్వహించి ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడంటూ వైసీపీ నేత జోగి రమేష్‌పై కేసున మోదు చేశారు.